PM Modi: చిన్ననాటి టీచర్‌ను కలిసిన ప్రధాని మోదీ

Pm Modi (2)
PM Modi: గుజరాత్ లోని నవసరీలో తన చిన్ననాటి స్కూల్ టీచర్ ను కలిశారు ప్రధాని మోదీ. పలు ప్రాజెక్టుల ఓపెనింగ్ నిమిత్తం గుజరాత్ లో ఒకరోజు పర్యటనకు వెళ్లారు. తన మాజీ టీచర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అభివాదం చేశారు. గుజరాత్ గౌరవ్ అభియాన్ తో పాటు పలు కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొనున్నారు.
ప్రధాని మోదీ ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’లో పాల్గొని నవ్‌సారిలోని గిరిజన ప్రాంతమైన ఖుద్వేల్‌లో సుమారు రూ. 3వేల 50 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన నిర్వహిస్తారు. ఇందులో ఏడు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, 12 ప్రాజెక్టుల శంకుస్థాపన వేడుకలు, 14 ప్రాజెక్టుల భూమి పూజ ఉన్నాయి.
ఈ ప్రాజెక్టులు కనెక్టివిటీని పెంచడం, జీవన సౌలభ్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రాంతంలో నీటి సరఫరాను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
Read Also: ఐకానిక్ సెలబ్రేషన్స్‌లో కొత్త కాయిన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
తాపి, నవ్‌సారి, సూరత్ జిల్లాలకు రూ.961 కోట్ల విలువైన 13 నీటి సరఫరా ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి భూమిపూజ చేస్తారు. నవ్‌సారి జిల్లాలో దాదాపు రూ. 542 కోట్లతో నిర్మించనున్న వైద్య కళాశాలకు భూమిపూజను కూడా ఆయన నిర్వహించనున్నారు. ఇది ఈ ప్రాంత ప్రజలకు అందుబాటు ధరలో, నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో సహాయపడుతుంది.
సుమారు రూ.586 కోట్ల వ్యయంతో నిర్మించిన మధుబన్ డ్యామ్ ఆధారిత ఆస్టోల్ ప్రాంతీయ నీటి సరఫరా ప్రాజెక్టును, అలాగే రూ.163 కోట్ల విలువైన ‘నల్ సే జల్’ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సూరత్, నవ్సారి, వల్సాద్, తాపీ జిల్లాలకు నీరు అందుతుంది.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw