Nandamuri Family : నందమూరి కుటుంబంలో విషాదం.. ఆ హీరో తల్లి కన్నుమూత..
నందమూరి కుటుంబంలో నేడు విషాదం నెలకొంది. హీరో చైతన్య కృష్ణ తల్లి శ్రీమతి పద్మజ మరణించారు.(Nandamuri Family)

Nandamuri Family
Nandamuri Family : నందమూరి కుటుంబంలో నేడు విషాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు నందమూరి జయకృష్ణ భార్య పద్మజ నేడు తెల్లవారుజామున మరణించారు. నందమూరి జయకృష్ణ – పద్మజల తనయుడు చైతన్య కృష్ణ గతంలో ధమ్, బ్రీత్ సినిమాల్లో హీరోగా నటించారు.(Nandamuri Family)
సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కోడలు, జయకృష్ణ భార్య, చైతన్య కృష్ణ తల్లి శ్రీమతి పద్మజ 73 ఏళ్ళ వయసులో మరణించింది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఈరోజు తెల్లవారుజామున హాస్పిటల్ లో చేర్పించారు. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తెల్లవారు జామున ఆమె మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు.
ఈ వార్త తెలిసి విజయవాడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఢిల్లీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, వివిధ ప్రదేశాల్లో ఉన్న మిగిలిన నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ కి బయలుదేరారు.