R Narayanamurthy : పాలిటిక్స్‌లోకి ఆర్ నారాయణమూర్తి.. అవకాశం ఉన్నా రాలేదు.. మూడు పార్టీల నుంచి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్స్ ఆఫర్..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రాజకీయాల్లోకి రావాలని ఎంపీ, ఎమ్మెల్యే టికెట్స్ ఆఫర్స్ వచ్చినట్టు తెలిపారు.(R Narayanamurthy)

R Narayanamurthy : పాలిటిక్స్‌లోకి ఆర్ నారాయణమూర్తి.. అవకాశం ఉన్నా రాలేదు.. మూడు పార్టీల నుంచి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్స్ ఆఫర్..

R Narayanamurthy

Updated On : August 19, 2025 / 11:04 AM IST

R Narayanamurthy : మొదటి నుంచి విప్లవాత్మక సినిమాలు చేస్తూ జనాల్ని మెప్పించారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి. ఎన్నో సూపర్ హిట్ విప్లవ సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించి, నిర్మించి ఇప్పుడు కూడా అడపాదడపా సందేశాత్మక సినిమాలు చేస్తున్నారు. త్వరలో యూనివర్సిటీ పేపర్ లీక్ అనే సినిమాతో రాబోతున్న నారాయణమూర్తి(R Narayanamurthy) తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రాజకీయాల్లోకి రావాలని ఆఫర్స్ వచ్చినట్టు తెలిపారు.

ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ.. నేను స్కూల్ డేస్ నుంచి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. కాలేజీలో స్టూడెంట్ ప్రసిడెంట్, ఫైన్ ఆర్ట్ సెక్రటరీ, రిక్షా యూనియన్ ప్రెసిడెంట్‌, ఫెడరేషన్ కన్వినర్‌.. ఇలా చాలా పదువులు చేశాను కానీ నాకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు. కానీ నాకు రాజకీయాల్లోకి రమ్మని టికెట్స్ ఆఫర్ చేసారు.

Also Read : Sasivadane : ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న సినిమా.. ఎప్పట్నుంచో వెయిటింగ్..

మొదటిసారి చంద్రబాబు గారు తెలుగు దేశం పార్టీ నుంచి కాకినాడ ఎంపీ టికెట్ ఆఫర్ చేసారు. మూడు సార్లు ఆఫర్ చేసారు, వద్దన్నాను. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 2004లో తుని ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేసారు, వద్దని చెప్పాను. 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యంలోకి రమ్మని తుని ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆఫర్ ఇచ్చారు అప్పుడు కూడా వద్దని చెప్పాను.

నాకు సినిమా పిచ్చి. రాజకీయాల్లోకి వెళ్తే సమయం అంతా అటే ఇవ్వాలి. రెండు పడవల మీద కళ్ళు పెట్టడం నాకు కష్టం. రాజకీయాలు ప్రజలు, సేవకు చెందిన అంశం. అటు వెళ్తే సినిమాల్లోకి రాలేను. అందుకే రాజకీయాల్లోకి వెళ్ళలేదు అని తెలిపాడు.

Also Read : Thiruveer : తండ్రి కాబోతున్న హీరో.. భార్యకు ఘనంగా సీమంతం..