Vulcan Salute
Vulcan Salute : కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ జోరు పెంచారు. ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. కలబురగిలో కాసేపు చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ ‘వల్కాన్ సెల్యూట్’ ఎలా చేయాలో నేర్పారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
రీసెంట్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సొంత జిల్లాలో తన రోడ్ షోకి ముందు మోదీ చిన్నారులతో ఇంటరాక్ట్ అయ్యారు. రోడ్డుపై ముళ్ల కంచెకు అవతల నిలబడి ఉన్న పిల్లలలో కాసేపు సంభాషించారు. ఈ సందర్భంలో ‘వల్కాన్ సెల్యూట్’ చేశారు. మీరు ఇలా చేయగలరా? అంటూ వారికి ఎలా చేయాలో సరదాగా నేర్పించారు.
తరువాత ‘మీరందరూ చదువుకుంటున్నారా? చదువుకున్న తరువాత ఏమి అవ్వాలనుకుంటున్నారు?’ అంటూ పిల్లల్ని ప్రశ్నించారు. తాము పోలీస్ ఆఫీసర్, డాక్టర్ కావాలని అనుకుంటున్నట్లు పిల్లలు మోదీకి సమాధానం చెప్పారు. మోదీని చూడగానే సంతోషంగా పిల్లలంతా ఆయన చేతిని అందుకోవాలని ముళ్లకంచె అవతల నుంచి ప్రయత్నం చేశారు.
Karnataka elections 2023: కిరీటం వంటి తలపాగాను ధరించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకత ఏంటీ?
ఇంతకీ మోదీ పిల్లలకు చెప్పిన ‘వల్కాన్ సెల్యూట్’ అంటే ఏంటంటే? స్టార్ ట్రెక్ టెలివిజన్ సిరీస్‌లో మిస్టర్ స్పోక్ అనే పాత్రను చేసిన లియోనార్డ్ నిమోయ్ ద్వారా ఈ సెల్యూట్ పరిచయం అయ్యింది. ఈ సెల్యూట్‌ను విజయానికి గుర్తుగా వాడతారట. ఇదే మోదీ పిల్లలకు నేర్పించారన్నమాట. అరచేతిలో నాలుగు వేళ్ల మధ్యలో V గుర్తు వచ్చేలా ఈ సెల్యూట్ చేస్తారు. రాబోయే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీన పోటీ పడుతున్నాయి. తమ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ మోదీ వల్కాన్ సెల్యూట్ చేసి ఉంటారని అందరూ అభిప్రాయపడుతున్నారు.
#WATCH | Karnataka: Prime Minister Narendra Modi had a light-hearted interaction with children in Kalaburagi earlier today, before the roadshow here. pic.twitter.com/HYOoei56xf
— ANI (@ANI) May 2, 2023