karnataka election 2023 : ప్రధాని మోదీ చుట్టూ కన్నడ రాజకీయాలు .. మోదీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంగా మారిన ఎన్నికలు

కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పోటీ పోటీగా కృషి చేస్తున్నాయి. గతంతో వ్యూహాత్మక రాజకీయాలతో అధికారం చేపట్టిన బీజేపీ ఆసారి మాత్రం అధికారం చేపట్టాలంటే ప్రధాని చేసే మ్యాజిక్‌పైనే ఆశ పెట్టుకుంది. వారి ఆశలకు జీవంపోసేలా మోదీ ప్రచార సభలకు భారీ సంఖ్యలో జనం రావటమే శుభసంకేతంగా భావిస్తున్నారు కన్నడ బీజేపీ నేతలు. పలు ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కన్నడ బీజేపీ పెద్దలు ఎన్నికల్లో కాడి పడేశారు. మోదీమీదనే ఆశలు పెట్టుకున్నారు.

karnataka election 2023 : ప్రధాని మోదీ చుట్టూ కన్నడ రాజకీయాలు .. మోదీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంగా మారిన ఎన్నికలు

PM Modi Karnataka Political Tour

karnataka election 2023 :  కర్ణాటకలోఅసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎవరి నోట విన్నా మోదీ మాటే వినిపిస్తోంది. విమర్శలు, పొగడ్తలు, ఆరోపణలు, కీర్తి జపాలు అన్నీ ప్రధాని మోదీ చుట్టూనే తిరుగుతున్నాయి. దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావమైన కీలకశక్తిగా ఎదిగిన మోదీ..కర్ణాటక ఎన్నికల ప్రధాన కేంద్రంగా మారారు. దీంతో తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీ హవాకు చెక్‌ పెట్టాలంటే బీజేపీని కర్ణాటకలో ఓడించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పాలంటే కన్నడ నాట సత్తా చాటాలని ప్రధాని భావిస్తున్నారు. దీంతో కర్ణాటక ఎన్నికలు మోదీ, కాంగ్రెస్‌ యుద్ధంగా మారిపోయాయి.

కన్నడ రాజకీయాలు ప్రధాని మోదీ చుట్టూ తిరుగుతున్నాయి. గతంతో వ్యూహాత్మక రాజకీయాలతో అధికారం చేపట్టిన బీజేపీ ఆసారి మాత్రం అధికారం చేపట్టాలంటే ప్రధాని చేసే మ్యాజిక్‌పైనే ఆశ పెట్టుకుంది. వారి ఆశలకు జీవంపోసేలా మోదీ ప్రచార సభలకు భారీ సంఖ్యలో జనం రావటమే శుభసంకేతంగా భావిస్తున్నారు కన్నడ బీజేపీ నేతలు. పలు ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కన్నడ బీజేపీ పెద్దలు ఎన్నికల్లో కాడి పడేశారు. మోదీమీదనే ఆశలు పెట్టుకున్నారు. సర్వేలన్నీ ప్రతికూలంగా వస్తుండటంతో భారం అంతా ప్రధానిపై మోపారు. వారి ఆశలు నిజం చేసేలా కన్నడ సీమలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని తన మార్కు రాజకీయంతో.. తనదైన వాక్చాతుర్యంతో ప్రతిపక్షాలను ఎండగడుతున్నారు. తనదైనశైలి మాటల మాయాజాలంతో ప్రజల్ని ఆకట్టుకుంటున్నారు.

కర్ణాటక ఎన్నికల నగారా మోగినప్పటినుంచి అధికార, ప్రతిపక్ష పార్టీల ఎత్తులు, వ్యూహాలు, విమర్శలు, వాగ్బాణాలు అన్నీ మోదీ చుట్టూనే తిరుగుతున్నాయి. అలా ఏదోరకంగా ప్రతిపక్షాలు, ప్రజల నోళ్లలో నానుతున్నారు మోదీ. పార్టీ ఆఫీస్‌ బ్యారెర్ల నుంచి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు కూడా కర్ణాటకలోనే మకాం వేశారు. బూత్‌ లెవెల్‌ నుంచి ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తూ కన్నడ ఫైట్‌ తమకు ఎంత ముఖ్యమైనదో చాటిచెబుతున్నారు. కమలదళం అంతా చెమటోడ్చుతున్న ఆ రాష్ట్ర పార్టీ ముఖ్యులపై వ్యతిరేకతతో తొలుత బీజేపీ ప్రచారం నిస్తేజంగా కనిపించింది. వరుసగా వస్తున్న సర్వేలు కాషాయ నేతలకు రుచించని ఫలితాలను ఇవ్వటంతో వారిలో నైరాశ్యం ఆవహించింది. ఇలాంటి సమయంలో రంగంలోకి దిగిన ప్రధాని మొత్తం ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేశారు. తన ఇమేజ్‌తో కన్నడ సమస్యలు, అక్కడి నేతలపై ఆరోపణలను వెనక్కి నెట్టేశారు. ఎన్నికలు తనకు, కాంగ్రెస్‌కు మధ్య జరుగుతున్నాయనే వాతావరణాన్ని క్రియేట్‌ చేశారు. ప్రచార సభల్లో కన్నడ భాషలో ప్రసంగాలను ప్రారంభిస్తున్న మోదీ.. చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. నా సభలకు వచ్చిన మీ అందరికీ నేను ఓ విషయం చెబుతా వింటారా అంటూ సభికుల అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటున్నారు. మరేం లేదు ఇంటికెళ్లాక సభకు రానివారికి మోదీ వచ్చారు అని చెప్పండి.. నన్ను చూసి ఓటు వేయమని మాట తీసుకోండి అంటూ తన మాట ప్రతి ఓటరుకు చేరేలా.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ప్రధాని.

ఎన్నికల ప్రకటన రాకముందు తొమ్మిదిసార్లు కర్ణాటకలో పర్యటించిన ప్రధాని.. మరో 20 ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించేలా కమలదళం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలోని 224 స్థానాలపై ప్రభావం చూపేలా సభలను ఏర్పాటు చేసింది. ప్రధాని ప్రచార కార్యక్రమం, రోడ్‌షోలకు భారీ సంఖ్యలో జన సమీకరణ చేస్తోంది. బెంగళూరు, మైసూరుల్లో ఇసకేస్తే రాలనంత జనం హాజరయ్యారు. ఆ జనం చూసిన కన్నడ బీజేపీ నేతలు.. మోదీపై జనానికి మోజు తగ్గలేదని.. ప్రధాని క్లీన్‌ ఇమేజ్‌తో ఎన్నికల్లో విజయం సాధించొచ్చనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటకలో బీజేపీ గెలుపు ఆ పార్టీకే కాదు.. వ్యక్తిగతంగా ప్రధాని మోదీకి కూడా ప్రతిష్టాత్మకం. వరుసగా రెండోసారి గెలవడం కర్ణాటకలో ఏ పార్టీకైనా అసాధ్యం. అదేసమయంలో మళ్లీ ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు, ఈ ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎలక్షన్స్‌కి కర్ణాటక సెమీఫైనల్‌గా చెబుతున్నారు. కర్ణాటకలో గెలిచిన పార్టీకి వచ్చే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఎన్నికలు జరగబోయే తెలంగాణ, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో ముఖాముఖి తలపడనుంది. కర్ణాటకలోనూ ఈ రెండు పార్టీల మధ్యే జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో కన్నడ విజయం దేశ చరిత్రను మలుపు తిప్పే అవకాశం ఉంది. కర్ణాటకలో బీజేపీ గెలిస్తే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ హవాకు అడ్డే ఉండదు. దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చి.. తన నాయకత్వానికి తిరుగులేదనే నిరూపించుకునే అవకాశం మోదీకి దక్కుతుంది. దేశంలో ఒకప్పుడు ఇందిరాయే ఇండియా.. ఇండియాయే ఇందిరాగా ఉండేది. బీజేపీ జైత్రయాత్ర కొనసాగితే ఇకపై మోదీయే ఇండియాగా నినాదం మారిపోవచ్చు. వ్యక్తిగతంగా ఇది మోదీ కీర్తిని మరింత ఎత్తుకు తీసుకువెళుతుంది. అందుకే కర్ణాటకలో ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ సిద్దాంతాలకు సడలింపులిచ్చి గెలుపు తంత్రం రుచిస్తున్నారు మోదీ.

ఎన్నికల్లో ఉచిత హామీలు.. జనాకర్షక పథకాలకు బీజేపీ వ్యతిరేకం. దేశంలో గతంలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ ఉచిత హామీలు ఇచ్చినా బీజేపీ తీవ్ర విమర్శలు చేసేది. కానీ, అదే బీజేపీ ఇప్పుడు కర్ణాటకలో ఉచిత పాలు, గ్యాస్‌ సిలిండర్లు, బియ్యం అంటూ ఆల్‌ ఫ్రీ వాగ్దానాలు చేస్తోంది. సుమారు 103 ఎన్నికల హామీలు గుప్పించి ఓట్లు దండుకోవాలని చూస్తోంది. ప్రధాని మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉండగా, ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ మ్యానిఫెస్టోను రిలీజ్‌ చేశారు. ఉచిత హామీల ప్రకటన చేశారు. కానీ, మోదీ ఎక్కడా ఉచిత హామీల మాట ఎత్తడం లేదు. తనను చూసే బీజేపీకి ఓటేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌ తనను విమర్శిస్తుందని చెబుతున్నారు. ఓటర్ల అటెన్షన్‌ అంతా తనపైనే ఉండేలా మోదీ చూసుకుంటున్నారు. ఎన్నికల సీన్‌లో తాను తప్ప మరో నేత కనిపించకూడదన్న టైప్‌లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు మోదీ.