Christmas Wishes : యేసుక్రిస్తు జీవితం, బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకం.. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

Christmas Wishes : దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల క్రిస్మస్ రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. భారతదేశం, విదేశాలలో ఉన్న పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ సంతోషకరమైన సందర్భంగా న్యాయం, స్వేచ్ఛ విలువలపై ఆధారపడిన సమాజాన్ని నిర్మించాలని సంకల్పిద్దాం. యేసుక్రీస్తు బోధలను మన జీవితంలో అనుసరిద్దామని అన్నారు.

చదవండి : Christmas : దేశవ్యాప్తంగా క్రిస్‌మస్‌ సంబరాలు

ఇక ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రిస్తు జీవితం, బోధనలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కరుణ, ప్రేమ, సేవ, దయ యేసుక్రిస్తు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. యేసు జీవితం, బోధనలను గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుసంపన్నంగా ఆయూరారోగ్యాలతో సామరస్యంతో జీవించాలని ఆకాంక్షించారు. కాగా.. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. కరోనా నిబంధనలు అనుసరిస్తూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.

చదవండి : Christmas Celebrations : సీఎం కేసీఆర్‌ క్రిస్మస్‌ విందు

ట్రెండింగ్ వార్తలు