Narayana: నారాయణ బెయిల్‌పై అప్పీల్‌కు వెళ్తాం: చిత్తూరు ఎస్పీ
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బెయిల్‌పై అప్పీలుకు వెళ్తామని పోలీస్ శాఖ ప్రకటించింది.
- Narender Thiru
- Published On : May 11, 2022 / 07:55 PM IST
Narayana
Narayana : పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో అరెస్టైన మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బెయిల్‌పై అప్పీలుకు వెళ్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు చిత్తూరు ఎస్పీ కార్యాలయం బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. నారాయణ బెయిల్‌పై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న గిరిధర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం, లభించిన సాక్ష్యాల ఆధారంగా, నారాయణ వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డట్లు తేలిందని, అందుకే ఆయన్ను అరెస్టు చేశామని ఎస్పీ కార్యాలయం చెప్పింది.
నారాయణ లాంటి విద్యాసంస్థలు విద్యా ప్రమాణాలను పక్కనబెట్టి, కేవలం ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుకునేందుకు ఈ అనైతిక చర్యకు పాల్పడ్డాయని ప్రకటనలో వివరించారు. మరోవైపు ప్రశ్నాపత్రాల మాల్ ప్రాక్టీస్ విషయంలో లోతైన దర్యాప్తునకు సిద్దంగా ఉన్నట్లు, విచారణ వేగవంతం చేసినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.
