10th Class Paper Leak : టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ లీక్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..గంగాధర్‌రావు వాంగ్మూలంలో కీలక విషయాలు

పేపర్ మాల్‌ ప్రాక్టీస్‌కు సహకరించిన ఇన్విజిలేటర్లకు 5 నుంచి 10 వేల రూపాయలు నారాయణ యాజమాన్యం అందించిందని గంగాధర్‌రావు తెలిపారు. దీంతో వారు ఇన్విజిలేటర్ల పిల్లలకు నారాయణ విద్యాసంస్థల్లో ఉచితంగా అడ్మిషన్లు ఇస్తామని మభ్యపెట్టినట్లు తెలిపాడు.

10th Class Paper Leak : టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ లీక్‌ కేసులో కొత్త ట్విస్ట్‌..గంగాధర్‌రావు వాంగ్మూలంలో కీలక విషయాలు

Ssc Paper Leak

Tenth Class paper leak : ఏపీ టెన్త్‌ ఏగ్జామ్‌ పేపర్‌ మాల్‌ ప్రాక్టీస్‌లో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంగాధర్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్ ను చిత్తూరు జిల్లా పోలీసులు విడుదల చేశారు. విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేందుకు తప్పుడు పనులు చేశామని పోలీసుల ముందు అంగీకరించాడు గంగాధర్‌రావు. యాజమాన్యం ఆదేశాలతోనే మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడ్డామని… ఇందుకోసం నారాయణ విద్యాసంస్థల అధినేత, సెంట్రల్ ఆఫీస్‌ ఇంఛార్జ్లు డీన్లు, ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్‌తో సమావేశమయ్యారని తెలిపాడు.

తమ విద్యాసంస్థకు తగిన గుర్తింపు వచ్చేందుకు కృషి చేయాలని… ఇన్విజిలేటర్లకు డబ్బులిచ్చి పేపర్‌ లీక్‌కు ప్లాన్ చేయాలని ఆదేశించినట్లు గంగాధర్‌రావు వాంగ్మూలంలో పోలీసులు పేర్కొన్నారు. పేపర్ మాల్‌ ప్రాక్టీస్‌కు సహకరించిన ఇన్విజిలేటర్లకు 5 నుంచి 10 వేల రూపాయలు నారాయణ యాజమాన్యం అందించిందని గంగాధర్‌రావు తెలిపారు. దీంతో వారు ఇన్విజిలేటర్ల పిల్లలకు నారాయణ విద్యాసంస్థల్లో ఉచితంగా అడ్మిషన్లు ఇస్తామని మభ్యపెట్టినట్లు తెలిపాడు.

TDP Leader Narayana : ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసు : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్..!

డీఈవో ఆఫీసు నుంచి ఏయే పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు ఉన్నారో.. .వారి వివరాలు సేకరించి ఆ తర్వాత వారితో కాంటాక్ట్ అయి డీల్ కుదుర్చుకున్నట్లు వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. పేపర్ లీక్‌ కోసం ఎన్ఆర్‌ఐ అకాడమీని సంప్రదించగా…. ఆ అకాడమీ ఫ్యాకల్టీ సుధాకర్‌ నుంచి గిరిధర్‌రెడ్డికి వాట్సప్‌ ద్వారా ప్రశ్నాపత్రం లీకైంది. వెంటనే సమాధానాలు తయారు చేసి విద్యార్థులకు పంపించామని తెలిపాడు. వాటర్‌ బాయ్స్ సిబ్బంది సహకారంతో వాటర్ ప్యాకెట్ల ముసుగులో ఆన్సర్స్‌ను చేరవేశామని గంగాధర్‌రావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.