Google search : మహిళ మర్డర్ మిస్టరీని ఛేదించిన గూగుల్ సెర్చ్ హిస్టరీ

తనతో సహజీవనం చేస్తున్న లేడీని గొంతు కోసి చంపేశాడు. ఏమీ ఎరగనట్లు బిహేవ్ చేశాడు. తను తీసుకున్న గోతిలో తనే పడ్డట్లు గూగుల్ సెర్చ్ హిస్టరీ అతడిని పట్టించింది. ఇంతకీ ఈ మిస్టరీ ఎలా వీడింది..

killer was found through a Google search : గూగుల్ సెర్చ్ హిస్టరీ ఓ మహిళ మర్డర్ మిస్టరీని ఛేదించింది. హంతకుడిని పట్టుకోవడంలో సహాయపడింది. కేరళలో జరిగిన హత్యోదంతం సంచలనం రేపుతోంది.

Salman Khan : సల్మాన్ ఖాన్‌కి బెదిరింపు ఇమెయిల్.. 5 ఏళ్లగా మర్డర్ ప్లాన్.. అసలు కథ ఏంటి?

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో దారుణం జరిగింది. 33 ఏళ్ల ప్రశాంత్ నంబియార్, 42 ఏళ్ల సుచిత్రా పిళ్లై సహజీవనం చేస్తున్నారు. సుచిత్ర వృత్తిరీత్యా బ్యూటీషియన్ ట్రైనర్. ప్రశాంత్‌కి ఆల్రెడీ పెళ్లైంది. సుచిత్ర ప్రశాంత్ భార్యకు దూరపు బంధువు. సుచిత్ర కూడా రెండు వివాహాలు విఫలమైన తరువాత్ ప్రశాంత్‌తో చనువుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో అతనితో బిడ్డను కనాలని ఉన్నట్లు చెప్పింది. అందుకు ప్రశాంత్ ససేమిరా అన్నాడు. ఇదే విషయంపై ఇద్దరికీ కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

Missed Call: 11 ఏళ్ల బాలిక మర్డర్ కేసులో నిందితుల్ని పట్టించిన మిస్‭డ్ కాల్

ఈ నేపథ్యంలో సుచిత్రను ఎలాగైనా మట్టుబెట్టాలని ప్రశాంత్ నిర్ణయించుకున్నాడు. గొంతు కోసి చంపేసి ఆమె మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టివేశాడు. ఆ తర్వాత ఆన్‌లైన్ కి వెళ్లి మృతదేహాన్ని ఎలా పారవేయాలో వెతికాడు. పోలీసులను నేరస్థులు ఎలా మోసం చేస్తారు అనే సినిమాల కోసం కూడా సెర్చ్ చేశాడు. అతను చేసిన గూగుల్ సెర్చ్‌తో ప్రశాంతే ఈ మర్డర్ చేశాడని పోలీసులు ఈజీగా కనిపెట్టేశారు. అరెస్ట్ చేసిన జైలుకి తరలించారు. కొల్లాం అదనపు సెషన్స్ కోర్టు-1 ప్రశాంత్‌కు జీవిత ఖైదు విధించింది. ప్రశాంత్ తను తీసుకున్న గోతిలో తనే పడ్డాడు. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

ట్రెండింగ్ వార్తలు