Missed Call: 11 ఏళ్ల బాలిక మర్డర్ కేసులో నిందితుల్ని పట్టించిన మిస్‭డ్ కాల్

ఆ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తన కుమార్తె పాఠశాలకు వెళ్లి బస్సులో వెళ్లినట్లు బాధితురాలి తల్లి పేర్కొంది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నలుగురు అన్నదమ్ముల్లో అమ్మాయి ఒక్కతే చెల్లి అని, ఇంట్లో అందరూ ఆమెను చాలా ప్రేమిస్తారని తల్లి కన్నీళ్లు పెట్టుకుంది.

Missed Call: 11 ఏళ్ల బాలిక మర్డర్ కేసులో నిందితుల్ని పట్టించిన మిస్‭డ్ కాల్

11 Year Old Delhi Girl's Kidnap Case Solved Because Of Missed Call

Missed Call: ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో 11 ఏళ్ల బాలిక అదృశ్యమైన రోజున ఆమె తల్లికి గుర్తు తెలియని నంబర్ నుండి మిస్డ్ కాల్, మర్డర్ మిస్సరీని చేధించింది. ఆ మిస్డ్ కాల్ ఆధారంగా నేరస్తుడిని గుర్తించిన పోలీసులు, హత్య జరిగిన 12 రోజులకు రోహిత్ అలియాస్ వినోద్ అనే నేరస్తుడిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్ చేసి హత్యకు గురైన బాలిక ఫిబ్రవరి 9న రోజు ఉదయం పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. తమ కుమార్తె కిడ్నాప్‌కు గురైందని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరి 10న కేసు నమోదు చేశారు. అయితే కూతురు కిడ్నాప్ అయిన రోజు ఉదయం 11.50 గంటలకు ఆమె తల్లికి గుర్తు తెలియని నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఆమె తిరిగి కాల్ చేయగా నంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందట.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి నయా రికార్డు.. ఓటీటీలో జై బాలయ్య మేనియా!

పోలీసుల విచారణ సాగుతుండగా చిన్నారి తల్లి మిస్ట్ కాల్ గురించి చెప్పారు. ఆ నంబర్ ఆధారంగా హంతకుడు రోహిత్‭ను (21) అరెస్టు చేశారు. విచారణలో, పోలీసులు ఎలక్ట్రానిక్ నిఘా ద్వారా మొబైల్ నంబర్‌ను ట్రాక్ చేసి పంజాబ్, మధ్యప్రదేశ్‌లో దాడులు నిర్వహించారు. నిందితుడిని ఫిబ్రవరి 21న పట్టుకుని విచారించగా నేరం అంగీకరించి ఫిబ్రవరి 9న బాలికను హత్య చేసి శవాన్ని ఘెవ్రా మోర్ సమీపంలో పడేసినట్లు వెల్లడించాడు. ముండ్కా గ్రామంలో కుళ్లిపోయిన బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

CWC: కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత విభాగానికి ఎన్నికలు లేవు, సభ్యుల్ని అధ్యక్షుడు ఖర్గేనే నియమిస్తారట

ఆ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తన కుమార్తె పాఠశాలకు బస్సులో వెళ్లినట్లు బాధితురాలి తల్లి పేర్కొంది. సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నలుగురు అన్నదమ్ముల్లో అమ్మాయి ఒక్కతే చెల్లి అని, ఇంట్లో అందరూ ఆమెను చాలా ప్రేమిస్తారని తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. నిందితుడు మృతదేహాన్ని పడేసిన ప్రదేశానికి పోలీసు బృందాన్ని తీసుకెళ్లాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిచారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించి, నిందితుడిని కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాశ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాలికపై లైంగిక వేధింపులు జరిగాయా అనేది పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడవుతుందని అన్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.