YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాశ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం, ప్రధానంగా ఆ రూ.40కోట్ల డీల్ గురించే

సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని విచారిస్తోంది. విచారణలో భాగంగా బ్యాంకు లావాదేవీలపై సీబీఐ అధికారులు ఎంపీ అవినాశ్ రెడ్డిని ఆరా తీశారు. దస్తగిరి స్టేట్ మెంట్ ను ప్రస్తావిస్తూ అవినాశ్ ను ప్రశ్నించారు. రూ.40 కోట్ల ఫండింగ్ పై సీబీఐ ప్రశ్నలు సంధించింది.

YS Viveka  Case : వైఎస్ వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాశ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం, ప్రధానంగా ఆ రూ.40కోట్ల డీల్ గురించే

YS Viveka Case : సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని రెండు గంటలుగా సీబీఐ విచారిస్తోంది. న్యాయవాదుల సమక్షంలో తనను విచారించాలని అవినాశ్ రెడ్డి కోరగా.. విచారణ సమయంలో న్యాయవాదులకు అనుమతి లేదని సీబీఐ అధికారులు తేల్చి చెప్పారు.

విచారణలో భాగంగా బ్యాంకు లావాదేవీలపై సీబీఐ అధికారులు ఎంపీ అవినాశ్ రెడ్డిని ఆరా తీశారు. దస్తగిరి స్టేట్ మెంట్ ను ప్రస్తావిస్తూ అవినాశ్ ను ప్రశ్నించారు. రూ.40 కోట్ల ఫండింగ్ పై సీబీఐ ప్రశ్నలు సంధించింది. అయితే, దాని గురించి తనకేమీ తెలియదని ఎంపీ అవినాశ్ రెడ్డి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో ఉన్న కాల్ లిస్ట్, నిందితుల టవర్ లొకేషన్లపైనా సీబీఐ అధికారులు ఎంపీ అవినాశ్ రెడ్డిని ప్రశ్నించారు.

Also Read..Kodali Nani : వైఎస్ వివేకాను జగన్ ఎందుకు చంపుతారు? వైఎస్ కుటుంబాన్ని దెబ్బకొట్టాలని చూశారు- కొడాలి నాని

హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ కీలక పాత్ర పోషించినట్లు మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. వివేకా హత్య జరిగిన రోజు నిందితులంతా ఒకే ఇంట్లో ఉన్నారని, దానికి సంబంధించి కాల్ లిస్ట్, గూగుల్ డేటా ఇలా అన్ని రకాల ఆధారాలను అవినాశ్ ముందు ఉంచి విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. బ్యాంకు లావాదేవీలపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం.(YS Viveka Case)

ఒక ప్రత్యేక గదిలో అవినాశ్ ను అధికారులు విచారిస్తున్నారు. కాగా, అవినాశ్ ను విచారిస్తుండటం ఇది రెండోసారి కావడంతో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏం జరగనుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది.

Also Read..Sajjala Ramakrishna Reddy : సీబీఐ ఇన్వెస్టిగేషన్ పేరుతో డ్రామా : సజ్జల

హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో కేసు విచారణకు ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరయ్యారు. శుక్రవారం నాటి విచారణలో ముఖ్యంగా రూ.40 కోట్ల డీల్ పై అవినాశ్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఏ2 సునీల్ యాదవ్ బెయిల్ కౌంటర్ లో సీబీఐ సంచలన విషయాలను పేర్కొన్న సంగతి తెలిసిందే. హత్య జరిగిన రోజు నిందితులంతా అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్టు గుర్తించినట్టు సీబీఐ తెలిపింది. హత్య కుట్ర మొత్తం అవినాశ్ కు ముందే తెలుసంది. వివేకా హత్య కోసం రూ.40 కోట్ల డీల్ వ్యవహారంపై అవినాష్ ను సీబీఐ సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నేడు విచారణ ముగిసిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.