Pawankalyan
PawanKalyan: ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతలపై జనసేన పార్టీ కొంతకాలంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి కాస్త మెరుగైనప్పటికీ కరెంటు కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో జనసేన పార్టీ సమావేశం జరుగుతుండా కరెంటు పోయింది. శుక్రవారం రాత్రి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అయితే, సమావేశం మధ్యలోనే కరెంటు పోయింది.
FDI inflow: దేశంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. ఒక్క ఏడాదిలో ఎంతంటే
దీంతో పవన్ కల్యాణ్‌తోపాటు అందరూ ఫోన్ లైట్లు ఆన్ చేసుకుని సమావేశం కొనసాగించారు. పవన్ కల్యాణ్ కూడా తన స్మార్ట్‌ఫోన్ లైట్ ఆన్ చేసి, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భానికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేశారు.
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు శుక్రవారం రాత్రి మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతుండగా కరెంటు పోయింది. అప్పుడు ఈ ఫోన్ల లైట్ల వెలుగులో మాట్లాడారు. pic.twitter.com/NAICy5ujxF
— JanaSena Party (@JanaSenaParty) May 20, 2022