FDI inflow: దేశంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. ఒక్క ఏడాదిలో ఎంతంటే

దేశంలోకి గత ఏడాది భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను, 83.57 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం ప్రకటించింది.

FDI inflow: దేశంలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ.. ఒక్క ఏడాదిలో ఎంతంటే

Fdi Inflow

FDI inflow: దేశంలోకి గత ఏడాది భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను, 83.57 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. ఒక పక్క కోవిడ్, మరోపక్క ఉక్రెయిన్ వార్ ఉన్నప్పటికీ, అంతకుముందు ఏడాదితో పోలిస్తే పెట్టుబడులు పెరగడం విశేషం.

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ.. అమరరాజాపై చర్యలపై స్టే

అంతకముందు ఆర్థిక సంవత్సరం కంటే, ఈ ఏడాది 1.60 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయి. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2003-04 సంవత్సరంతో పోలిస్తే ఇప్పటివరకు పెట్టుబడులు 20 రెట్లు పెరిగాయి. అప్పట్లో 4.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది తయారీ రంగంలో దాదాపు 76 శాతం పెట్టుబడులు పెరిగాయి. గతేడాది మన దేశంలో పెట్టుబడులు పెట్టిన దేశాల్లో సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. తర్వాత అమెరికా 18 శాతం, మారిషస్ 16 శాతం ఇన్వెస్ట్ చేశాయి. అత్యధిక పెట్టుబడులు వచ్చిన రంగాల్లో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ రంగం మొదటి స్థానంలో ఉంది.

Rahul Gandhi: పాంగాంగ్ సరస్సుపై చైనా బ్రిడ్జి.. కేంద్రంపై రాహుల్ ఫైర్

ఈ రంగంలో 25 శాతం పెట్టుబడులు వచ్చాయి. తర్వాత సర్వీస్ సెక్టార్‌, ఆటోమొబైల్ సెక్టార్‌లలో సమానంగా 12 శాతం పెట్టుబడులు వచ్చాయి. అత్యధికంగా పెట్టుబడులు పొందిన రాష్ట్రం కర్ణాటక (25 శాతం) కాగా, తర్వాత మహారాష్ట్ర (17 శాతం)తో రెండో స్థానంలో ఉంది.