బర్త్ డే చేసుకోనన్న రాహుల్..PPE Kits, ఫుడ్ ప్యాకేట్లను పంపిణీ చేస్తున్న కాంగ్రెస్

  • Publish Date - June 19, 2020 / 06:01 AM IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదినం నేడు (2020, జూన్ 19వ తేదీ). కానీ బర్త్ డే వేడుకలను జరుపుకోవద్దని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో భారత సైనికులపై డ్రాగన్‌ ఆ‍ర్మీ అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అసులుబాసిన విషయం తెలిసిందే. ఈ కారణంగా తన బర్త్ డే వేడుకలను జరుపవద్దని రాహుల్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. దీంతో కేకులు కట్ చేసేందుకు పార్టీ నేతలు ముందుకు రాలేదు. అయితే..పార్టీ మరో నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి చేసేందుకు పోరాడుతున్న యోధులకు PPE Kits అందించాలని నిర్ణయం తీసుకుంది. 

చైనా సరిహద్దులో భారతీయ సైనికులు ఎంతో ధైర్యసాహాసాలు ప్రదర్శించారని, వీరమరణం పొందిన వారికి సంతాపం తెలియచేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వెల్లడించారు. ఈ విషాదకరమైన సమయంలో రాహుల్ బర్త్ డే వేడుకలు జరుపవద్దని రాష్ట్రాల పార్టీ నేతలకు సూచించారు. కేకులు, శుభాకాంక్షలతో కూడిన బ్యానర్లు కట్టవద్దన్నారు. వేడుకలకు దూరంగా ఉండాలన్నారు. దేశ వ్యాప్తంగా పార్టీ నేతలు వీర జవాన్లకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించలన్నారు. పేదలకు ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేయాలన్నారు. 

Read: చెప్పిన టైం కంటే ముందే చేశాం.. అప్పుల్లేని కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ : ముఖేష్ అంబానీ

ట్రెండింగ్ వార్తలు