Mahesh Babu: మహేశ్ బాబును ఓదార్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూయడంతో, యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణకు తమ నివాళులర్పించేందుకు సినీ రంగానికి చెందిన సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు నానక్‌రామ్‌గూడలోని కృష్ణవిజయ నివాసానికి చేరుకుంటున్నారు.
- Anil Aaleti
- Published On : November 15, 2022 / 09:01 PM IST
Prabhas condolence To Mahesh Babu
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూయడంతో, యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణకు తమ నివాళులర్పించేందుకు సినీ రంగానికి చెందిన సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు నానక్‌రామ్‌గూడలోని కృష్ణవిజయ నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు, యంగ్ హీరోలు కృష్ణకు నివాళి అర్పించారు.
మహేశ్ బాబు ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో ఆయన్ను పలువురు సెలెబ్రిటీలు పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించాడు. తరువాత మహేశ్‌ను ప్రత్యేకంగా కలిసి, ఆయన్ను ఓదార్చాడు. సినిమా ఇండస్ట్రీలో కృష్ణంరాజు, కృష్ణ ఎంత స్నేహంగా ఉండేవారో ఈ సందర్భంగా వారు గుర్తుకు చేసుకున్నారు. ఇటీవల కృష్ణంరాజు కూడా మృతిచెందడం, ఇప్పుడు కృష్ణ కూడా మృతిచెందడంతో ప్రభాస్, మహేశ్ ఇద్దరు కూడా తీవ్రంగా బాధపడ్డారు.
మహేశ్‌ను ప్రభాస్ ఓదార్చిన తీరుతో వారిద్దరి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందనే విషయం అభిమానులకు అర్థం అవుతుంది. కష్టాల్లోనూ ఒకరికొకరు ఓదార్చుకోవడం చూసి అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు.
