KGF2: ఆయన పాత్రపై ప్రశాంత్ నీల్ క్లారిటీ!
కొన్ని సినిమాల్లో కొందరు నటీనటులు చేసే పాత్రలు వారికి చాలా మంచి పేరును తీసుకొస్తాయి. అయితే అలాంటి పాత్రలు మరోసారి చేసే అవకాశం వస్తే ఎవరు మాత్రం వద్దని అంటారు...
- Anil Aaleti
- Published On : April 12, 2022 / 02:48 PM IST
Prashanth Neel Clarifies About Anant Nag Role
KGF2: కొన్ని సినిమాల్లో కొందరు నటీనటులు చేసే పాత్రలు వారికి చాలా మంచి పేరును తీసుకొస్తాయి. అయితే అలాంటి పాత్రలు మరోసారి చేసే అవకాశం వస్తే ఎవరు మాత్రం వద్దని అంటారు. కానీ కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్-1 చిత్రంలో ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించిన నటుడు, ఇప్పుడు దాని సీక్కెల్‌గా వస్తున్న ‘కేజీఎఫ్ 2’లో నటించడం లేదు. ఇప్పటికే ఆ నటుడు ఎవరనేది మీకు అర్థమయ్యి ఉంటుంది. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో రాఖీ పాత్రకు సంబంధించిన కథను రాసిన సీనియర్ జర్నిలిస్ ఆనంద్ వాసిరాజన్ పాత్రలో నటించిన అనంత్ నాగ్.. ఈ సినిమాలోని హీరో కథను ఓ మీడియా ఛానల్‌కు వివరించే క్రమంలో కేజీఎఫ్ సినిమా కథ నడుస్తుంటుంది.
KGF2: పుష్పతో పెట్టుకుంటారా.. అంటూ యశ్ పరువు తీసిన తెలుగు మీడియా!
అయితే కేజీఎఫ్-1లో అనంత్ నాగ్ చెప్పిన డైలాగులు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడు ఆయన కేజీఎఫ్-2లో కనిపించడట. నిజానికి కేజీఎఫ్ చాప్టర్ 2 కథను కూడా ఆయనే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఆయన పాత్రపట్ల సంతోషంగా లేని కారణంగా అనంత్ నాగ్, కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా నుండి వాకౌట్ చేసినట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా వెల్లడించారు. ఈ సినిమాలో ఆయన నటించనని చెప్పడం తమకు బాధను కలిగించినా, ఆయన తీసుకున్న నిర్ణయానికి తాము అంగీకరించినట్లు చెప్పుకొచ్చారు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2లో ఆయన స్థానంలో ప్రకాశ్ రాజ్ ఈ సినిమా కథను ముందుకు తీసుకెళ్లనున్నట్లు ప్రశాంత్ నీల్ పేర్కొన్నాడు.
KGF2: ఆర్ఆర్ఆర్‌ను క్రాస్ చేసిన కేజీఎఫ్2..?
కాగా ప్రకాశ్ రాజ్ చేసేది అనంత్ నాగ్ చేసిన పాత్ర కాదని.. ఇందులో ఆయన పాత్ర పేరు వేరుగా ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఇలాంటి సినిమా నుండి అనంత్ నాగ్ ఎందుకు వాకౌట్ చేశాడా అనేది ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. ఇక ప్రకాశ్ రాజ్ కేజీఎఫ్ 2 కథను ఎలా ముందుకు తీసుకెళ్తాడో తెలియాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు.
