Prawn In The Nose
Prawn In The Nose : ఏలూరు జిల్లా గణపవరంలో వింత ఘటన జరిగింది. సాయి రామకృష్ణ అనే వ్యక్తి చెరువులో రొయ్యలు పడుతుండగా… ఓ రొయ్య అతని ముక్కులో దూరింది. ముక్కు రంధ్రాల్లోకి దూరి అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో ఆ వ్యక్తికి ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డాడు. చేతితో దానిని బయటకు తీద్దామన్నా రాకపోవటంతో వెంటనే బంధువులు అతడిని భీమవరంలోని ఈఎన్టీ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ ఎండోస్కోపీ నిర్వహించిన వైద్యులు ముక్కు రంధ్రాలకు రొయ్య గుచ్చుకు పోయినట్టు గుర్తించారు. జాగ్రత్తగా శస్త్ర చికిత్స చేసి ముక్కులో ఇరుకున్న రొయ్యను వైద్యులు తొలగించి రామకృష్ణ ప్రాణం కాపాడారు. కాగా… ముక్కులోంచి బయటకు తీసే సమయానికి కూడా రొయ్య బతికే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రొయ్య ముళ్లు ముక్కులో గుచ్చుకోవటంతో అయిన గాయాలకు చికిత్స నిర్వహించి సాయి రామకృష్ణను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
Also Read : Chintamaneni Prabhakar : కోడి పందాలతో నాకేం సంబంధం లేదు-చింతమనేని