President Droupadi Murmu addresses: దేశం అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకువెళుతోంది: జాతినుద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగం

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవాళ జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకువెళుతోందని చెప్పారు. మనది శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశమని అన్నారు. అమర జవాన్ల త్యాగాల వల్లే స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నామని చెప్పారు. భారత్ 75 ఏళ్ళ స్వాతంత్ర్య ఉత్సవాలు పూర్తి చేసుకుంటోందని అన్నారు.

President Droupadi Murmu addresses: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవాళ జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం అనేక రంగాల్లో అభివృద్ధిలో దూసుకువెళుతోందని చెప్పారు. మనది శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశమని అన్నారు. అమర జవాన్ల త్యాగాల వల్లే స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నామని చెప్పారు. భారత్ 75 ఏళ్ళ స్వాతంత్ర్య ఉత్సవాలు పూర్తి చేసుకుంటోందని అన్నారు.

దేశ విభజన సందర్భంగా ఆగస్టు 14న స్మృతి దివస్ జరుపుకుంటున్నామని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమర జవాన్లను స్మరించుకోవాల్సి ఉందని అన్నారు. మనం విదేశీ శృంఖలాలను ఛేదించుకుని స్వాతంత్ర్యం సాధించుకున్నామని చెప్పారు. ఎందరో మహనీయులు ఆధునిక భారత్ నిర్మాణానికి కంకణబద్ధులయ్యారని చెప్పారు. పేదరికం, నిరక్షరాస్యతపై పోరాడుతున్నామని అన్నారు. హర్ ఘర్ తిరంగా నినాదం విజయవంతమైందని చెప్పారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచానికి మన సత్తా చాటిచెప్పామని ఆయన అన్నారు.

కాగా, ప్రజలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ 76వ స్వాతంత్య్ర దినోత్సవం భారత చరిత్రలో ఒక చిరస్మరణీయమైన రోజని, స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకుందామని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక భారత్ అన్ని రంగాల్లో పురోగతిని సాధించిందని చెప్పారు.

China-Taiwan Conflict: యుద్ధ సన్నాహాల వేళ భారత్ సహా పలు దేశాలకు కృతజ్ఞతలు తెలిపిన తైవాన్

ట్రెండింగ్ వార్తలు