Presidential Elections
Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. నామినేషన్లకు మొదటి రోజైన బుధవారం 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సరైన పత్రాలు లేని కారణంగా ఒక అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ దాఖలు చేసిన వారిలో బిహార్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ అనే వ్యక్తి ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. అదే పేరుతో ఆర్‌జేడీ నేత, బిహార్ సీనియర్ పొలిటీషియన్ లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
Gopalkrishna Gandhi: రాష్ట్రపతి ఎన్నిక.. తెరపైకి మహాత్మా గాంధీ మనవడి పేరు
మొదటి రోజు నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఢిల్లీ, బిహార్, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికకు నామినేషన్ వేయాలంటే 50 మంది ఓటు హక్కు కలిగిన అభ్యర్థులు ప్రతిపాదించాలి. మరో 50 మంది ఓటర్లు కూడా ప్రతిపాదిస్తూ సెకండరీ సంతకాలు చేయాలి. ఈ ఎన్నిక కోసం రూ.15,000 డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల 18న ఎన్నిక జరుగుతుంది. జూలై 24న రాష్ట్రపతిగా రామ్ నాథ్ పదవి ముగియనుండగా, జూలై 25న కొత్త రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.