Priyanka Gandhi : ప్రియాంక ఎన్ని’కల’ దోశ

ప్రజా ప్రతినిధుల ఎన్నికల స్టంట్లు మరీ విచిత్రంగా ఉంటాయి. కొందరు రైతుల పొలాల్లోకి వెళ్లి పనులు చేస్తారు. కొందరు రోడ్లు ఊడ్చేస్తారు.. తాజాగా ప్రియాంక గాంధీ ఓ రెస్టారెంట్లో దోశలు వేసారు. ఇలాంటి పనులు కాంగ్రెస్ పార్టీ కలల్ని నెరవేరుస్తాయంటారా?

Priyanka Gandhi

జనాల్ని ఆకట్టుకోవడానికి ప్రజా ప్రతినిధులు రకకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. ఎలక్షన్స్ టైంలో అయితే మరీను.. వాళ్లు చేసే స్టంట్స్ మరింత నవ్వు తెప్పిస్తాయి. . కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దోశలు వేశారు. ఆమె దోశలు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Telangana Congress: ఈసారి పక్కా.. 8న తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన..

త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంలో మైసూరులోని మైలారీ హోటల్‌కి వెళ్లారు. హోటల్ వంట గదిలోకి వెళ్లి సిబ్బందితో మాట్లాడారు. అంతేనా? నేను దోశలు వేస్తానంటూ పిండిని తీసుకుని దోశ కూడా వేశారు. అనంతరం కాసేపు అక్కడే కూర్చుని టిఫిన్ చేశారు.

 

ఇక ఆ హోటల్ యజమానికి, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు చెప్పి వారితో సెల్ఫీ దిగారు. ఈ విషయాన్ని ప్రియాంక స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘మైలారీ హోటల్‌లో దోశలు వేయడం చాలా సంతోషాన్నిచ్చింది. వారెంతో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారు. మీ చక్కని ఆతిథ్యానికి ధన్యవాదాలు. దోశలు చాలా రుచిగా ఉన్నాయి. నా కూతురికి కూడా త్వరలో ఇక్కడి దోశలు రుచి చూపిస్తాను’ అంటూ పోస్టు పెట్టారు.

WFI chief Brij Bhushan: దమ్ముంటే తనపై పోటీ చేయమంటూ ప్రియాంక గాంధీకి రెజ్లర్ బాడీ చీఫ్ బ్రిజ్ బూషణ్ సవాల్

ఇక ప్రియాంక హోటల్ కి వచ్చిన సమయంలో ఆమె వెంట కాంగ్రెస్ నేతలు డీకే.శివకుమార్, రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా ఉన్నారు.