Punjab Govt 424 Vips Security Withdraws
Punjab CM Bhagwant Mann : పంజాబ్ లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల లంచం అడిగానే ఆరోపణలు రావడంతో ఏకంగా మంత్రినే క్యాబినెట్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భగవంత్ మాన్ భద్రతను తొలగించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్రంలోని 424 మంది ప్రముఖులకు ప్రభుత్వం కల్పించిన భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. భద్రత తొలగించబడిన వ్యక్తులలో రిటైర్డ్ పోలీసు అధికారులు, మత,రాజకీయ నాయకులు ఉన్నారు.
Also read : Gujarat : 8 ఏళ్ల పాలనలో గాంధీజీ, పటేల్ కలల సాకారానికి కృషి చేశాం : ప్రధాని మోడీ
రాజకీయ నేతలు, మత పెద్దలు, రిటైర్డ్ పోలీసు అధికారులు 424 మందికి భద్రతను ఉపసంహరిస్తున్నామని శనివారం (మే 28,2022) ప్రభుత్వం ప్రకటించింది. అందులో డేరా రాధ సోమీ బ్యాస్ కు ఉన్న 10 మంది భద్రతా సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నామని వెల్లడించింది. 2022 ఏప్రిల్ లో మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ సహా పలువురు మాజీ మంత్రులు ఇతర నేతలు సహా 184 మంది భద్రతను ఉపసంహరించుకున్నట్టు మాన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఆ నిర్ణయంతో 400 మంది పోలీసులు మళ్లీ స్టేషన్ డ్యూటీలు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలిగానీ.. వీఐపీలకు భద్రత పేరుతో జనానికి ఇబ్బందులు కలిగించకూడదని సీఎం భగవంత్ మాన్ అన్నారు. కాగా..ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేల పింఛను విషయంలోనూ మాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Also read : Minister Arvind Raiyani : ఇనుప గొలుసులతో కొట్టుకున్న బీజేపీ మంత్రి..కరెన్సీ నోట్లు చల్లిన అభిమానులు
అలాగే ఇప్పటికే ఇకపై ఎవరైనా ఎన్నిసార్లైనా ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్క పదవీకాలానికి సంబంధించిన పింఛను మాత్రమే వస్తుందని ప్రటకించారు. ప్రస్తుతం నెలకు రూ.3.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల దాకా పింఛను తీసుకునే మాజీ ఎమ్మెల్యేలున్నారని, తాము తీసుకున్న నిర్ణయంతో కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా అవుతుందని అన్నారు.