Gujarat : 8 ఏళ్ల పాలనలో గాంధీజీ, పటేల్ కలల సాకారానికి కృషి చేశాం : ప్రధాని మోడీ

ఎన్నిదేళ్ల మా పాలనలో మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు కన్న భారతదేశాన్ని నిర్మానానికి కృషి చేశాం అని ప్రధాని మోదీ తెలిపారు.

Gujarat : 8 ఏళ్ల పాలనలో గాంధీజీ, పటేల్ కలల సాకారానికి కృషి చేశాం : ప్రధాని మోడీ

Pm Modi In Gujarat

Updated On : May 28, 2022 / 2:36 PM IST

Gujarat : ఎన్నిదేళ్ల మా పాలనలో మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు కన్న భారతదేశాన్ని నిర్మానానికి కృషి చేశాం అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజలు సిగ్గుపడేలా ఏమీ చేయలేని అన్నారు. గుజరాత్ లోని రాజ్ కోట్ లోని అత్‌కోట్‌లో శనివారం (మే 28,2022) కొత్తగా నిర్మించిన మాతుశ్రీ కేడీపీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మోదీ ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోడీ.. పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు సాధికారత సాధించాలని బాపూజీ కోరుకున్నారని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే భారతదేశం కూడా కోవిడ్ -19తో పోరాడుతున్నందున వ్యాక్సిన్ ప్రజలకు చేరువయ్యేలా ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.

మహిళలకు గౌరవప్రదమైన జీవితం కోసం ..జన్ ధన్ యోజన పథకం ప్రజలకు ఉపయోగపడినట్లు ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. రైతులు, కార్మికుల జన్ ధన్ ఖాతాల్లో నేరుగా నగదు డిపాజిట్ చేసామని..కరోనా, యద్ధ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నామని, ఎక్కడా రాజీ పడలేదని గుర్తు చేశారు. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను సరఫరా చేయడంతోపాటు.. ప్రజలు అందరికీ ఉచిత టీకాలు అందించామన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజల ప్రయత్నాలు తోడైనప్పుడు సేవ చేసే బలం పెరుగుతుందన్నారు.

నేడు తాను ఈ స్థాయిలో ఉండడానికి గుజరాతే కారణమని..అందుకు ధన్యవాదాలు తెలియజేశారు ప్రధాని మోడీ. గుజరాత్ ప్రజలు సిగ్గు పడే పని ఒక్కటీ చేయలేదన్నారు. కాగా ప్రధాని స్వంత రాష్ట్రమైన గుజరాత్ లో 2022 చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దృష్ట్యా బీజేపీ అక్కడ మరోసారి అధికారం నిలబెట్టుకునే దిశగా ప్రచార కార్యక్రమాలను షురూ చేసింది.