NTR: తారక్‌తో చేయాలంటూ తన కోరికను బయటపెట్టిన సీనియర్ హీరోయిన్!

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పలుసార్లు సినిమాలను తన నటనతో ఒంటిచేత్తో బ్లాక్‌బస్టర్ విజయాలుగా మలిచిన.....

Radhika Sarat Kumar Keen To Work With Jr Ntr

NTR: టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పలుసార్లు సినిమాలను తన నటనతో ఒంటిచేత్తో బ్లాక్‌బస్టర్ విజయాలుగా మలిచిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయన తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీముడో పాటలో చూపించిన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు పూర్తిగా ఫిదా అయ్యారు. ఇలాంటి మేటి యాక్టర్‌తో ఒక్క సినిమాలోనైనా నటించాలని చాలా మంది హీరోయిన్లు కోరుతుంటారు.

NTR: ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్.. భారీగా పెంచేసిన తారక్!

తాజాగా ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడానికి ఓ సీనియర్ హీరోయిన్ కూడా ఆసక్తిని కనబరుస్తోంది. బుల్లితెరపై ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ అనే టాక్ షోలో తాజాగా రాధికా శరత్ కుమార్ పాల్గొంది. ఇప్పుడున్న యాక్టర్స్‌లో కూడా చాలా మంది తమ హావభావాలతో సినిమాలను మరో లెవెల్‌కు తీసుకెళ్తున్నారని.. వారిలో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక తారక్ పర్ఫార్మెన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. తారక్ చేసే సినిమాలను ఆమె ఎక్కువ చూస్తానంటూ చెప్పుకొచ్చింది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఇలా తారక్ గురించి, అతడి నటనపై ప్రశంసల వర్షం కురిపించడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మున్ముందు తారక్ సినిమాలో అవకాశం వస్తే ఖచ్చితంగా అతడితో స్క్రీన్ పంచుకుంటానని రాధికా శరత్ కుమార్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.