NTR: ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్.. భారీగా పెంచేసిన తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు మూడేళ్ల తరువాత ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆయన అభిమానులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు.....

NTR: ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్.. భారీగా పెంచేసిన తారక్!

Ntr Hikes Remuneration Post Rrr

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు మూడేళ్ల తరువాత ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆయన అభిమానులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో మరో హీరోగా నటించారు. కాగా ఈ సినిమాలో తారక్, చరణ్‌ల పర్ఫార్మెన్స్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కడంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Jr NTR: ఇక జాతరే.. ఫ్యాన్స్‌లో జోష్ పెంచుతున్న తారక్ మూవీ లైనప్

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటవిశ్వరూపానికి ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. ఆయన తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియెన్స్‌ను కట్టిపడేశాడు. ఈ సినిమాలో ఆయన నటనకు క్రిటిక్స్ నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, తారక్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో, తారక్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం తారక్ మరోసారి పూర్తి మేకోవర్‌లోకి వెళ్తున్నాడు. ఇప్పటికే ఆయన స్లిమ్‌గా మారిన స్టైలిష్ లుక్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ సినిమా కోసం తారక్ తన రెమ్యునరేషన్‌ను అమాంతం రూ.10 కోట్ల మేర పెంచేసినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాకుగాను తారక్ రూ.45 కోట్లు రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తన 30వ సినిమా కోసం ఏకంగా రూ.55 కోట్లు పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం తారక్ ఇప్పటికే 70 రోజుల డేట్స్‌ను కేటాయించడంతో ఈ సినిమాను ఎంత స్పీడుగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

NTR30: ఈ నెలలో అలియా పెళ్లి.. ఎన్టీఆర్ కోసం మరో భామ?

కొరటాల-తారక్ కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో సినిమా వస్తుండటంతో ఈ చిత్రం ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో చూడాలి అంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.