Ragini Dwivedi : షూటింగ్‌లో గాయపడిన హీరోయిన్.. శరీరం తట్టుకోగలదు కానీ మనసే.. అంటూ ఎమోషనల్ పోస్ట్..

రాగిణి ద్వివేది ప్రస్తుతం ‘‘నన్నొబ్బ బరతియా’’ అనే కన్నడ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ ఆమె ఎడమ చేతికి గాయమైంది. దీంతో వెంటనే షూటింగ్‌ ఆపేసి...........

Ragini Dwivedi met with accident in movie shooting

Ragini Dwivedi :  కన్నడ భామ రాగిణి ద్వివేది కన్నడలో వరుసగా సినిమాలు చేస్తుంది. అప్పుడప్పుడు మలయాళంలోనూ పలకరిస్తుంది. మన తెలుగులో కూడా నాని సరసన జెండాపై కపిరాజు అనే ఒక సినిమా చేసి మెప్పించింది. తన కన్నడ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా దగ్గరైంది రాగిణి.

రాగిణి ద్వివేది ప్రస్తుతం ‘‘నన్నొబ్బ బరతియా’’ అనే కన్నడ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ ఆమె ఎడమ చేతికి గాయమైంది. దీంతో వెంటనే షూటింగ్‌ ఆపేసి ఆమెని హాస్పిటల్ కి తరలించారు చిత్ర యూనిట్. తన ఎడమచేతి కట్టు వేసి డిశ్చార్జ్ చేసి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని తెలిపారు వైద్యులు. దీంతో ప్రస్తుతానికి ఆ సినిమా షూట్ కి బ్రేక్ పడింది.

Shehnaaz Gill : బాడీగార్డ్స్ పై ఫైర్ అయిన బాలీవుడ్ భామ.. చప్పట్లు కొట్టిన అభిమానులు..

తన ఎడమచేతి కట్టిన కట్టుని చూపిస్తూ రాగిణి సెల్ఫీ తీసుకొని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాగిణి తన ఫోటోలు షేర్ చేసి.. మీ శరీరం దేన్నైనా తట్టుకోగలదు. మీరు ఒప్పించాల్సింది మీ మనస్సునే. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. త్వరలోనే మళ్ళీ షూట్ కి తిరిగి వస్తాను” అని పోస్ట్ చేసింది. దీంతో రాగిణి త్వరగా కోలుకోవాలని నెటిజన్లు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.