Shehnaaz Gill : బాడీగార్డ్స్ పై ఫైర్ అయిన బాలీవుడ్ భామ.. చప్పట్లు కొట్టిన అభిమానులు..

షెహనాజ్‌ తో ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. పక్కనే ఉన్న బాడీగార్డ్స్ అభిమానులని దూరంగా నెట్టేశారు. అభిమానులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో షెహనాజ్‌ తన బాడీగార్డ్స్ పై.........

Shehnaaz Gill : బాడీగార్డ్స్ పై ఫైర్ అయిన బాలీవుడ్ భామ.. చప్పట్లు కొట్టిన అభిమానులు..

Shehnaaz Gill fires on her bodyguards

Updated On : November 20, 2022 / 8:18 AM IST

Shehnaaz Gill :  పంజాబీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న షెహనాజ్‌ కౌర్ గిల్ బాలీవుడ్ లో బిగ్ బాస్ తో ఎంట్రీ ఇచ్చి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఏర్పరుచుకుంది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ సినిమాల్లో కూడా అవకాశాలు తెచ్చుకుంటుంది. హిందీ బిగ్ బాస్ ఈ అమ్మడికి బాగా ఉపయోగపడింది. తాజాగా షెహనాజ్‌ కౌర్ గిల్ దుబాయిలోని ఓ ఈవెంట్ కి వెళ్ళింది.

Director Madan : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు మృతి.. విషాదంలో సినీ పరిశ్రమ..

ఆ ఈవెంట్లో షెహనాజ్‌ తో ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. పక్కనే ఉన్న బాడీగార్డ్స్ అభిమానులని దూరంగా నెట్టేశారు. అభిమానులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో షెహనాజ్‌ తన బాడీగార్డ్స్ పై సీరియస్ అయింది. వాళ్ళు నా కోసం వచ్చారు, నాతో ఫోటోలు దిగడానికి వచ్చారు. మీకు ప్రాబ్లమ్ ఏంటి, అనవసరంగా వారిని ఇబ్బంది పెట్టకండి అంటూ బాడీగార్డ్స్ పై ఫైర్ అయింది షెహనాజ్‌. దీంతో అక్కడున్న ఆమె అభిమానులు చప్పట్లు కొట్టారు. అడిగిన అభిమానులందరికి సెల్ఫీలు ఇచ్చి వెళ్ళింది షెహనాజ్‌ గిల్. షెహనాజ్‌ బాడీగార్డ్స్ పై సీరియస్ అవ్వడం, అభిమానులు చప్పట్లు కొట్టే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.