Lok Sabha elections 2024: మోదీకి 2024 ఎన్నికల్లో రాహుల్ సవాలుగా నిలవగలరు.. కానీ..: గహ్లోత్

దేశంలో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సవాలుగా నిలవగలిగే ప్రభ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. అయినప్పటికీ, మోదీని ఎదుర్కొనే తమ నేత ఎవరన్న విషయంపై ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఓ నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్పారు.

Ashok Gehlot did self goal for his down path

Lok Sabha elections 2024: దేశంలో 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సవాలుగా నిలవగలిగే ప్రభ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. అయినప్పటికీ, మోదీని ఎదుర్కొనే తమ నేత ఎవరన్న విషయంపై ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఓ నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్పారు.

ఈ నెల 12న జరిగే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారని, పూర్తి స్థాయి మెజార్టీతో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. గుజరాత్ లో తాము ఇప్పటికే ఐదు యాత్రలు చేశామని, అక్కడ కూడా రాణిస్తామని చెప్పారు. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.

ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ఎందుకు ప్రచారంలో పాల్గొనడం లేదన్న విషయంపై అశోక్ గహ్లోత్ స్పందిస్తూ.. ‘‘రాహుల్ గాంధీ పలు రాష్ట్రాలకు వెళ్లలేరు. భారత్ జోడో యాత్రలో భాగంగా రూట్ మ్యాప్ ప్రకారం ఆయన పాదయాత్ర ఉంటుంది. అయితే, ఈ విషయాన్ని వివాదాస్పదంగా మార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు’’ అని అశోక్ గహ్లోత్ అన్నారు. గుజరాత్ లో రాహుల్ గాంధీ పర్యటించాలని చాలా డిమాండ్ ఉందని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..