Rahul Gandhi
Rahul Gandhi: ఇటీవల హత్యకు గురైన పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. పంజాబ్‌లోని సిద్ధూ స్వస్థలమైన మాన్సా జిల్లా, మూసాలో మంగళవారం రాహుల్, సిద్ధూ కుటుంబాన్ని కలుస్తారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గత అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధూ, మాన్సా జిల్లా నుంచి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో సిద్ధూ ఓడిపోయారు. ఆయన గత డిసెంబర్‌లోనే కాంగ్రెస్‌లో చేరారు. పార్టీతో ఆయనకు తక్కువ కాలమే అనుబంధం ఉన్నప్పటికీ, సొంత పార్టీ సభ్యుడు కావడంతో సిద్ధూ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ వెళ్తున్నారు. ఇటీవలే సిద్ధూ కుటుంబం కేంద్ర హోంమత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే.
Salman Khan: సల్మాన్‌ను చంపేందుకు రెక్కీ… వెల్లడించిన గ్యాంగ్‌స్టర్
సిద్ధూ పంజాబీ సింగర్‌గా ఎంతో పేరు సంపాదించారు. మూడేళ్ల మ్యూజిక్ కెరీర్‌లో అద్భుతమైన పాటలు పాడాడు. ఆయనకు కెనడాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. రెండు వారాల క్రితం పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వీవీఐపీలకు సెక్యూరిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మరునాడే సిద్ధూ హత్య జరిగింది. దీంతో భగవంత్ మన్ ప్రభుత్వంపై విమర్శలు పెరగిపోయాయి. ఈ నేపథ్యంలో తమ నిర్ణయాన్ని రద్దు చేసుకుంటూ, వీవీఐపీలకు సెక్యూరిటీ కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.