Salman Khan: సల్మాన్‌ను చంపేందుకు రెక్కీ… వెల్లడించిన గ్యాంగ్‌స్టర్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ను చంపేందుకు కుట్ర జరిగిందనే విషయం తాజాగా వెల్లడైంది. పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల సల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.

Salman Khan: సల్మాన్‌ను చంపేందుకు రెక్కీ… వెల్లడించిన గ్యాంగ్‌స్టర్

Salman Khan

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ను చంపేందుకు కుట్ర జరిగిందనే విషయం తాజాగా వెల్లడైంది. పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల సల్మాన్ ఖాన్‌ను చంపుతామని బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఆయనకు అదనపు భద్రత కల్పించింది. గతంలో కూడా సల్మాన్‌ను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం సల్మాన్‌ను చంపించేందుకు, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రయత్నించినట్లు తాజాగా వెల్లడైంది.

Kodandaram: అప్పులకుప్పగా మారిన తెలంగాణ: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం

లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల మరణించిన ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లారెన్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు. జైల్లో ఉన్న లారెన్స్‌ను 2021లో పోలీసులు సల్మాన్ ఖాన్ విషయంపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా తాను సల్మాన్‌ను చంపించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించాడు. సల్మాన్‌ను చంపేందుకు రాజస్థాన్‌కు చెందిన సంపత్ నెహ్రా అనే గ్యాంగ్‌స్టర్‌ను నియమించినట్లు బిష్ణోయ్ చెప్పాడు. బిష్ణోయ్ నుంచి ఆదేశాలు అందుకున్న సంపత్ నెహ్రా ముంబై వెళ్లాడు. అక్కడ సల్మాన్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించాడు. అయితే, అతడి దగ్గర ఉన్న చిన్న రైఫిల్‌తో సల్మాన్‌ను షూట్ చేయడం సాధ్యం కాలేదు. దీంతో ఈ విషయం బిష్ణోయ్‌కు తెలిసింది. ఆయన మరో మంచి గన్ అయిన ఆర్‌కే స్ప్రింగ్ రైఫిల్ తీసుకోమని చెప్పాడు.

Sunil Deodhar: ఏపీని జగన్ అప్పుల ఊబిలో దింపారు: సునీల్ దియోధర్

అనిల్ పాండ్య అనే వ్యక్తికి ఇందుకోసం దాదాపు నాలుగు లక్షల రూపాయలు చెల్లించాడు. సంపత్ సొంత గ్రామానికి చెందిన దినేష్ ఫౌజి అనే వ్యక్తి దగ్గర ఈ రైఫిల్ ఉండేది. అయితే, దినేష్ దగ్గరి నుంచి అనుకోకుండా పోలీసులు రైఫిల్ స్వాధీనం చేసుకుని, అతడ్ని అరెస్టు చేశారు. దీంతో అప్పట్లో సల్మాన్ హత్యకు సంబంధించిన ప్రయత్నం ఆగిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా సల్మాన్‌కు మళ్లీ బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్‌కు కూడా బెదిరింపు లేఖ వచ్చింది. సిద్ధూలాగే ఆయనను కూడా చంపుతామని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ సాగుతోంది. మరోవైపు సిద్ధూ హత్యతోపాటు, ఇతర కుట్రలపై బిష్ణోయ్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు.