Kodandaram: అప్పులకుప్పగా మారిన తెలంగాణ: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం

తెలంగాణ ఏర్పాటు ఒక ప్రత్యేక కారణంతో ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఎనిమిదేళ్ల కాలంలో అనుకున్న లక్ష్యాలేవీ నెరవేరలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదు. అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టారు.

Kodandaram: అప్పులకుప్పగా మారిన తెలంగాణ: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం

Kodandaram

Kodandaram: ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందని విమర్శించారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం. నిధుల ఖర్చు విషయంలో ఒక పద్ధతి లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఆత్మ గౌరవ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘‘తెలంగాణ ఏర్పాటు ఒక ప్రత్యేక కారణంతో ఏర్పడింది. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఎనిమిదేళ్ల కాలంలో అనుకున్న లక్ష్యాలేవీ నెరవేరలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎలాంటి ఉపయోగం లేదు. అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టారు. ఈ ప్రాజెక్టు ఇప్పుడు గుదిబండగా మారింది. ఉద్యోగ నియామకాలు లేక వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.

Sunil Deodhar: ఏపీని జగన్ అప్పుల ఊబిలో దింపారు: సునీల్ దియోధర్

కొందరు లెటర్లు రాసి మరీ ఆత్మహత్యలు చేసుకున్నారు. నిధుల విషయంలో ఒక పద్ధతి లేకపోవడంతో రాష్ట్రం ఇప్పుడు అప్పుల కుప్పగా మారింది. అప్పులు చేయకపోతే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టులన్నీ సీమాంధ్రులకే కట్టబెడుతూ, వారికి దోచి పెడుతున్నారు. అందుకే మరోసారి ఉద్యమ ఆకాంక్షల మేరకు ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నాం. ఉద్యమకారులంతా పోరాటం చేసి లక్ష్యాలను సాధిస్తాం’’ అని కోదండరాం ప్రసంగించారు.