Neet
Rains effect: అండర్ గ్రాడ్యుయేట్ జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్-యూజీ)ను వాయిదా వేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. నీట్-యూజీని జూలై 17న నిర్వహించాల్సి ఉంది. అయితే, వర్షాల తీవ్రత అధికంగా ఉందని, పలు ప్రాంతాల్లో వరదలూ వస్తున్నాయని అభ్యర్థులు చెప్పారు. దీంతో పరీక్ష రాసే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అభ్యర్థులు అంటున్నారు. తీవ్ర వర్షాల వేళ అభ్యర్థులు వందలాది కిలోమీటర్లు ప్రయాణించి పరీక్షకు హాజరయ్యే అవకాశాలు ఉండవని చెప్పారు.
Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి
పరీక్ష వాయిదా వేయాలని కేంద్రంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కు సూచనలు చేయాలని అభ్యర్థులు హైకోర్టును పిటిషన్‌లో కోరారు. గత ఏడాది ఇదే పరీక్షను సెప్టెంబరు 12న నిర్వహించారని నవంబరు 1న ఫలితాలు వెలువడ్డాయని చెప్పారు. ఈ ఏడాది మాత్రం ఏప్రిల్ 6నే నోటిఫికేషన్ విడుదల చేసి జూలై 17నే పరీక్ష నిర్వహిస్తామని చెప్పడంతో, అభ్యర్థులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని చెప్పారు. అభ్యర్థులు వేసిన ఈ పిటిషన్‌పై రేపు వాదనలు జరిగే అవకాశం ఉంది.