చందమామపైకి రాజాచారి

Raja Chari selected manned mission moon : చందమామపై కాలు మోపే భాగ్యం భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి లభించింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా బృందంలో భారత సంతతికి చెందిన రాజా చారికి ఈ అవకాశం దక్కింది. చంద్రయాన్ కార్యక్రమం కోసం చారి ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరోసారి మానవ సహిత చంద్రయాన్ కార్యక్రమం చేపట్టింది. నాసా బృందంలో 18 మంది అంతరిక్ష యాత్రికులు ఈ యాత్రలో పాల్గొంటుండగా….భారత సంతతికి చెందిన 43 ఏళ్ల రాజా జాన్ వుర్పుత్తూర్ చారి కూడా ఉన్నారు.
హైదరాబాద్‌లో మూలాలు : –
రాజాచారి కుటుంబ మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. రాజాచారి మస్సాచ్యుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, యూఎస్ నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లలో ఉన్నత విద్యను అభ్యసించారు. 2017లో నాసాలో చేరిన చారి 2019సో బేసిక్ శిక్షణ పూర్తి చేశారు. అమెరికా ఎయిర్ ఫోర్స్ లో కర్నల్‌గా పనిచేశారు. ప్రతిష్టాత్మక మానవసహిత చంద్రయాన్ కార్యక్రమంలో పాల్గొనడం తనకు గర్వంగా ఉందన్నారు చారి. తల్లిదండ్రుల ఉత్తమ పెంపకం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
ఆర్టామిస్ మూన్ మిషన్ : –
నాసా మిషన్ 2024ను ‘ఆర్టామిస్ మూన్ మిషన్’గా పేర్కొంటోంది. చంద్రయాన్ కార్యక్రమంలో పాల్గొంటున్న 18 మంది బృందంలో 9 మంది మహిళలే ఉన్నారు. 2024లో చంద్రునిపై తొలిసారి ఓ మహిళ అడుగుపెట్టనున్నట్లు నాసా పేర్కొంది. ఆర్టిమిస్ జెనరేషన్ బృందంలో వివిధ రంగాలకు చెందిన వారు పాల్గొనడం ప్రత్యేకతను సంతరించుకుంది. నైపుణ్యం, ఎక్స్ పీరియన్స్, సామాజిక నేపథ్యంతో కూడిన సభ్యులున్నారు. అమెరికా స్పేస్ మిషన్ లో భారత్ సంతతికి చోటు దక్కిన వారిలో రాజాచారి మూడో వ్యక్తి. అంతకు ముందు కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ నాసా మిషన్‌లో పాల్గొన్నారు.