Rajamouli : RRR సినిమా తర్వాత రాజమౌళి హాలీవుడ్ లోనే తిరుగుతున్నారు. అక్కడ సినిమా ఫెస్టివల్స్ లో పాల్గొంటూ RRR సినిమాని స్పెషల్ ప్రదర్శనలు వేపిస్తూ, పలు అవార్డులు అందుకుంటూ అమెరికాలోనే ఉన్నారు. అక్కడి మీడియాతో, అక్కడి ఛానల్స్, ప్రేక్షకులతో ముచ్చటిస్తున్నారు. RRR సినిమా రిలీజ్ అయి నెలలు గడుస్తున్నా ఇంకా ఆ క్రేజ్ అలాగే కొనసాగుతుంది.
ఇక మహేష్ ఇప్పటికే తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అని అనౌన్స్ చేశాడు. ఈ సినిమా గురించి గతంలో మాట్లాడుతూ ఓ అడ్వెంచరస్, గ్లోబల్ ట్రావెలింగ్ సినిమాలా ఉంటుందని తెలిపారు. మహేష్ అభిమానులు ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు కానీ సినిమా మాత్రం ఇంకా మొదలవ్వలేదు. రాజమౌళి అమెరికాలోనే ఉండటంతో ఇంకా ప్రీ ప్రొడక్షన్ అయినా మొదలయిందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.
తాజాగా రాజమౌళి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి తన నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడాడు. రాజమౌళి మాట్లాడుతూ.. ”నా నెక్స్ట్ సినిమా ఇంకా రైటింగ్ స్టేజిలోనే ఉంది. నేను, మా నాన్న, మరికొంతమంది కలిసి ఈ సినిమా కథ మీద వర్క్ చేస్తున్నాం. ఇది ఒక అడ్వెంచరస్ సినిమాలా, ఇండియానా జోన్స్ టైప్ లో ఉంటుంది. నాకు అలాంటి సినిమాలు ఇష్టం. అలాంటి కథని తీసుకొని దానిమీద వర్క్ చేస్తున్నాం” అని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
హాలీవుడ్ లో వచ్చిన ఇండియానా జోన్స్ సిరీస్ సినిమాలు భారీ విజయం సాధించాయి. కామెడీ, ట్రెజర్ హంట్, యాక్షన్స్ సీక్వెన్స్ లతో ఈ సినిమాలు ఉంటాయి. ఇప్పుడు మహేష్ తో రాజమౌళి చేయబయే సినిమా కూడా ఇలాంటిదే అని చెప్పడంతో మహేష్ అభిమానులు మరింత సంతోషపడుతూ సినిమాపై అంచనాలు పెంచుకుంటున్నారు. త్వరగా ఈ సినిమా మొదలవ్వాలి కోరుకుంటున్నారు.
My next with @urstrulyMahesh is an adventure film on the lines of Indiana Jones. We just started writing a couple of months ago – @ssrajamouli#MaheshBabu #Rajamouli #SSMB pic.twitter.com/1tW1utdiBc
— ??????????? (@UrsVamsiShekar) November 20, 2022