Toronto International Film Festival 2022 : టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో రాజమౌళి.. హాలీవుడ్ డైరెక్టర్స్ తో సినీ చర్చలు..

కెనడాలోని టొరంటోలో ప్రతి సంవత్సరం జరిగే ప్రతిష్టాత్మక టొరంటో ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో జరగనుంది. ఈ సారి ఫెస్టివల్ లో పలువురు సినీ టెక్నీషియన్స్ తో........

Rajamouli

Toronto International Film Festival 2022 :  అత్యంత ప్రతిష్టాత్మకమైన టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో రాజమౌళి పాల్గొననున్నారు. బాహుబలి సినిమాతో మన తెలుగు సినిమా పరిధిని ప్రపంచ స్థాయికి విస్తరించి ఇటీవల RRR సినిమాతో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడేలా చేశారు రాజమౌళి. RRR సినిమా అన్ని దేశాల్లోని ప్రేక్షకులకి, సినీ టెక్నీషియన్స్ కి బాగా నచ్చింది. ఈ సినిమాపై చాలా మంది హాలీవుడ్ టెక్నీషియన్స్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాతో రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం లభిస్తుంది.

Chandoo Mondeti : కార్తికేయ 3కి కూడా అవకాశం ఉంది.. మొదటిభాగంలోని హీరో తప్ప మిగిలిన పాత్రలు కార్తికేయ 2లో ఉండవు..

కెనడాలోని టొరంటోలో ప్రతి సంవత్సరం జరిగే ప్రతిష్టాత్మక టొరంటో ఫిలిం ఫెస్టివల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ లో జరగనుంది. ఈ సారి ఫెస్టివల్ లో పలువురు సినీ టెక్నీషియన్స్ తో చర్చలు జరపనున్నారు. ఇందుకు చాలా మంది హాలీవుడ్ డైరెక్టర్స్ రానున్నారు. ఈ సారి ఇందులో జరిగే సినీ చర్చల్లో పాల్గొనడానికి మన రాజమౌళికి ఆహ్వానం అందింది. ప్రస్తుతానికి భారతదేశం నుంచి కేవలం రాజమౌళికి మాత్రమే ఈ అవకాశం దక్కినట్టు తెలుస్తుంది. అలాగే ఈ ఫెస్టివల్ లో RRR సినిమాని ప్రదర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా RRR , రాజమౌళి పేర్లు వినపడనున్నాయి.