Rakesh Jhunjhunwala: ఇండియన్ వారెన్ బఫెట్.. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమే

స్టాక్ మార్కెట్లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమే అంటుంటారు విశ్లేషకులు. ఎందుకంటే ఆయన కొనుగోలు చేసిన షేర్లన్నీ దాదాపు లాభాలు కురిపించినవే.

Rakesh Jhunjhunwala: స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు సాధించడం వల్ల రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను అందరూ ఇండియన్ వారెన్ బఫెట్ అంటారు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఆయన పదకొండేళ్ల వయసులోనే షేర్లు కొనడం మొదలుపెట్టారని, పదమూడేళ్ల వయసులో మొదటిసారి పన్ను చెల్లించాడని అంటారు.

Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మృతిపై ప్రధాని, ప్రముఖుల సంతాపం

అందుకే ఆయనను ఇండియన్ వారెన్ బఫెట్ అని పిలుస్తారు. అయితే, అలా పిలవడం ఆయనకు నచ్చదు. సంపదలోనూ, విజయంలోనూ వారెన్ బఫెట్ తనకంటే ఎంతో ఎత్తున ఉన్నారని ఆయన చెప్పారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గురించి చాలా మంది చెప్పేది.. ఆయన పట్టిందల్లా బంగారమే అని. సరైన షేర్లను గుర్తించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన ఎంపిక చేసుకునే షేర్లు దాదాపు అన్నీ లాభాలు కురిపించినవే. ఇలా షేర్ మార్కెట్లో ఆయనకు దక్కిన విజయాలే ఆయన్నుసెలబ్రిటీని కూడా చేశాయి. ఆయనను ఇంటర్వ్యూ చేయని బిజెనెస్ మ్యాగజైన్స్, న్యూస్ ఛానెల్స్ లేవు. ఇటీవల జీ సంస్థలో ఒక వివాదం తలెత్తితే అందులో షేర్లు కొనుగోలు చేశారు. ఆ షేర్లలో కూడా దాదాపు 50 శాతం లాభాలు సాధించారు.

Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనూ ఆయన అడుగుపెట్టారు. హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఉన్నారు. ‘ఇంగ్లిష్-వింగ్లిష్’, ‘కీ అండ్ కా’, ‘షమితాబ్’ లాంటి హిందీ సినిమాలు కూడా నిర్మించారు. ఒక ఛానెల్‌లో నటి అలియా భట్‌తో మాట్లాడినప్పుడు షేర్ మార్కెట్ గురించి చెప్పారు. ‘‘మనం షేర్ మార్కెట్‌లో సర్దుకుపోయే స్వభావం లేకపోతే, దీనిలో విజయం సాధించలేం. ఇక్కడ మార్కెట్ మాత్రమే రాజు. మార్కెట్లో రాజులు అంటూ ఎవరూ లేరు. షేర్ మార్కెట్లో రాజులు కావాలని ప్రయత్నించిన వారంతా ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లారు” అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు