Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం

దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.

Rakesh Jhunjhunwala: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
ad

Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త, దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూశారు. ఆదివారం ఉదయం ముంబైలో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుండెపోటుకు గురైన ఝున్‌ఝున్‌వాలాను కుటుంబ సభ్యులు ఉదయం 06.45 గంటలకు స్థానిక క్యాండీ బ్రీచ్ ఆస్పత్రికి తరలించారు.

Salman Rushdie: సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగింపు.. నిందితుడిని ప్రశంసించిన ఇరాన్ మీడియా

అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన వయసు 62 ఏళ్లు. కిడ్నీ సమస్యలతోపాటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల ఆయన ఆస్పత్రి పాలయ్యారు. కొద్దివారాల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. స్టాక్ మార్కెట్‌లో అత్యంత లాభాలు అర్జించిన వ్యక్తిగా ఝున్‌ఝున్‌వాలాకు గుర్తింపు ఉంది. ఆయనను ఇండియన్ ‘వారెన్ బఫెట్’ అని కూడా పిలుస్తారు. ఇటీవలే ఆయన ‘ఆకాష్’ అనే ఎయిర్‌లైన్స్ సంస్థను స్థాపించారు. గత వారమే ఈ విమానయాన సంస్థ సేవలు ప్రారంభమయ్యాయి. ఆయన ఆస్తి విలువ దాదాపు రూ.35 వేల కోట్లు ఉంటుందని అంచనా. 1985లో ఐదు వేల పెట్టుబడితో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన ఆయన వేల కోట్ల లాభాలు సాధించారు.