Salman Rushdie: సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగింపు.. నిందితుడిని ప్రశంసించిన ఇరాన్ మీడియా

న్యూయార్క్ నగరంలో జరిగిన దాడిలో గాయపడ్డ రచయిత సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగించినట్లు, ఆయన మాట్లాడగలుగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని రష్దీ ప్రతినిధి ఆండ్రూ వెల్లడించారు. ఈ దాడిని ఇరాన్ మీడియా సమర్ధించింది.

Salman Rushdie: సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగింపు.. నిందితుడిని ప్రశంసించిన ఇరాన్ మీడియా

Updated On : August 14, 2022 / 8:39 AM IST

Salman Rushdie: దాడిలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సల్మాన్ రష్దీకి వైద్యులు వెంటిలేటర్ తొలగించారు. కొద్దిగా మాట్లాడగలుగుతున్నారని ఆయన ప్రతినిధి ఆండ్రూ వైలీ వెల్లడించారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు సమాచారం. శుక్రవారం సల్మాన్ రష్దీపై హదీ మటార్ అనే వ్యక్తి న్యూయార్క్ నగరంలో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడిలో రష్దీ తీవ్రంగా గాయపడ్డారు.

The Golden Joint: ప్రారంభానికి సిద్ధమైన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి

దాడి అనంతరం ఆయన్ను హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన కాలేయానికి గాయాలయ్యాయి. అలాగే మోచేతి వద్ద నరాలు తెగిపోయాయి. వైద్యుల అంచనా ప్రకారం ఆయన ఒక కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది. కాగా, దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం నిందితుడు చౌటాక్వా కౌంటీ జైలులో ఉన్నాడు. సల్మాన్ రాసిన ‘ద శాటానిక్ వర్సెస్’ నవలే ఆయనపై దాడికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ నవల ఇస్లాంకు వ్యతిరేకంగా ఉండటంతో దీన్ని అనేక దేశాలు నిషేధించాయి. అలాగే ఇరాన్ అప్పట్లోనే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

India Ban On VLC Media Player : వీఎల్‌సీ మీడియా ప్లేయర్‌‌పై నిషేధం విధించిన భారత్..! కారణం ఏంటంటే..

ఆయన్ను చంపేందుకు ఫత్వా కూడా జారీ చేసింది. అప్పట్నుంచి అనేక ఇస్లాం దేశాలు, సంస్థలు ఆయనపై ఆగ్రహంగా ఉన్నాయి. మరోవైపు రష్దీపై దాడి ఘటనను ఇరాన్ సమర్ధించింది. ఇరాన్.. రష్దీని వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌కు చెందిన అనేక పత్రికలు నిందితుడిని సమర్ధిస్తూ వ్యాఖ్యలు చేశాయి. సల్మాన్ రష్దీపై దాడికి పాల్పడిన నిందితుడి చేతిని ముద్దుపెట్టుకోవాలి అంటూ ఒక ఇరాన్ పత్రిక రాసింది.