The Golden Joint: ప్రారంభానికి సిద్ధమైన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి

ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు.. పొడవు 1.3 కిలోమీటర్లు. నిర్మాణానికి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బలమైన గాలులు, భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేలా బ్రిడ్జిని రూపొందించారు. ఈ బ్రడ్జి బరువు 10,619 మెగా టన్నులు కాగా, బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెగా టన్నుల ఉక్కును వినియోగించారు. మొత్తం ఏడు పిల్లర్లు ఉండగా సంగల్‭దాన్ అనే పిల్లర్ అత్యంత ఎత్తైంది (103 మీటర్లు). ఇది ఈఫిల్ టవర్ కన్నా 35మీటర్లు ఎత్తుగా ఉంటుంది. 2004లో తలపెట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణం ఎన్నో అవాంతరాలను తట్టుకుని పూర్తైంది.

The Golden Joint: ప్రారంభానికి సిద్ధమైన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి

Worlds highest The Golden Joint ready to launch

The Golden Joint: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన ‘ది గోల్డెన్ జాయింట్’ పనులు పూర్తైనట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‭లోని చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రైల్వే శాఖ.. ప్రారంభానికి సిద్ధమైనట్లు ప్రకటించింది. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా మార్గంలో ఈ బ్రిడ్జిని నిర్మించారు. కత్రా-బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ వంతెన కీలకమైన అనుసంధానంగా నిలవనుంది.

ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు, పొడవు 1.3 కిలోమీటర్లు. నిర్మాణానికి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బలమైన గాలులు, భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేలా బ్రిడ్జిని రూపొందించారు. ఈ బ్రడ్జి బరువు 10,619 మెగా టన్నులు కాగా, బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెగా టన్నుల ఉక్కును వినియోగించారు. మొత్తం ఏడు పిల్లర్లు ఉండగా సంగల్‭దాన్ అనే పిల్లర్ అత్యంత ఎత్తైంది (103 మీటర్లు). ఇది ఈఫిల్ టవర్ కన్నా 35మీటర్లు ఎత్తుగా ఉంటుంది. 2004లో తలపెట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణం ఎన్నో అవాంతరాలను తట్టుకుని పూర్తైంది.

దీని నిర్మాణం వల్ల ఢిల్లీ నుంచి కశ్మీర్‭కు ప్రయాణ సమయం తగ్గనుంది. ప్రస్తుతం ట్రక్కు రవాణాకు 48 గంటల సమయం పడుతుండగా ఈ బ్రిడ్జి ప్రారంభమైన తర్వాత కేవలం 20 గంటల్లోనే గమ్య స్థానాన్ని చేరుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల మరో ప్రయోజనం కూడా ఉందని ప్రభుత్వం చెబుతోంది. రవాణా ఖర్చు తగ్గడం వల్ల వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని ఓ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. వాస్తవానికి ఈ బ్రిడ్జిని 2009 డిసెంబర్ నాటికే పూర్తవ్వాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ సెప్టెంబర్ 2008లో వంతెన స్థిరత్వం, భద్రత మీద ఆందోళన చెంది రద్దు చేశారు. అనంతరం 2010లో పనులు పున:ప్రారంభమయ్యాయి.

RSS changed DP: విమర్శల నడుమ ఎట్టకేలకు డీపీ మార్చిన ఆర్ఎస్ఎస్