RSS changed DP: విమర్శల నడుమ ఎట్టకేలకు డీపీ మార్చిన ఆర్ఎస్ఎస్
ప్రధాని చేసిన సూచన సొంతింటికే చేరలేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. మరొక పక్క ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను మాత్రమే గౌరవిస్తుందని, జాతీయ జెండాను గౌరవించదని, ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఎప్పుడూ జాతీయ జెండాను ఎగరవేయరనే అపవాదులు మరోసారి భగ్గుమన్నాయి. ఇంతటి విమర్శల నడుమ ఎట్టకేలకు ఆర్ఎస్ఎస్ డీపీ మారింది. ప్రధాని మోదీ పెట్టినటువంటి డీపీనే ఆర్ఎస్ఎస్ ట్విట్టర్ ఖాతాలో అప్డేట్ చేశారు
RSS changed DP to national flag
RSS changed DP: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఏడాదిపాటు వేడుకలు నిర్వహిస్తోంది. కాగా, 75వ వార్షికోత్సవం దగ్గర పడిన తరుణంలో దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలని, అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో త్రివర్ణ పతాకాన్ని డీపీగా మార్చుకోవాలని జూలైలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.. దేశంలో అనేక మంది ఇప్పటికే వీటిని ఆచరిస్తున్నారు. అయితే బీజేపీ మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) ట్విట్టర్ ఖాతా మాత్రం డీపీ మార్చలేదు.
దీంతో విపక్షాలు, ఇతరుల నుంచి బీజేపీపై మోదీపై ఆర్ఎస్ఎస్పై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని చేసిన సూచన సొంతింటికే చేరలేదంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. మరొక పక్క ఆర్ఎస్ఎస్ కాషాయ జెండాను మాత్రమే గౌరవిస్తుందని, జాతీయ జెండాను గౌరవించదని, ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఎప్పుడూ జాతీయ జెండాను ఎగరవేయరనే అపవాదులు మరోసారి భగ్గుమన్నాయి. ఇంతటి విమర్శల నడుమ ఎట్టకేలకు ఆర్ఎస్ఎస్ తన డీపీ మారింది. ప్రధాని మోదీ పెట్టినటువంటి డీపీనే ఆర్ఎస్ఎస్ ట్విట్టర్ ఖాతాలో అప్డేట్ చేశారు. అంతటితో ఆగకుండా మోహన్ భాగవత్ జాతీయ జెండాను ఎగరవేసిన వీడియోను షేర్ చేశారు.
‘‘స్వేచ్ఛాయుత అమృత మహోత్సవాన్ని జరుపుకోండి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయండి. జాతీయ ఆత్మగౌరవాన్ని పెంచండి’’ అని ఆర్ఎస్ఎస్ ట్వీట్ చేసింది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ ట్విట్టర్ డీపీ కూడా జాతీయ పతాకానికి మారింది. ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అధినేత డీపీలు మారిన అనంతరం ఆర్ఎస్ఎస్ ప్రముఖులు, ఇతరుల డీపీలు మారుతున్నాయి. దీనికి ముందు చాలా మంది ఆర్ఎస్ఎస్ నేతల డీపీలు వేరేగా ఉండేవి. వీటిని పదే పదే ప్రస్తావిస్తూ నెటిజెన్లు, విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు
