RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకుడైన కేబీ.హెడ్గేవార్ స్పీచ్‌ను పాఠ్య పుస్తకాల్లో చేరుస్తూ కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) అనే విద్యార్థి సంఘం వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.

RSS Founder: పాఠంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడి స్పీచ్.. వ్యతిరేకంగా నిరసనలు

Rss

RSS Founder: కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకుడైన కేబీ.హెడ్గేవార్ స్పీచ్‌ను పాఠ్య పుస్తకాల్లో చేరుస్తూ కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) అనే విద్యార్థి సంఘం వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.

Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ నిరసన చేపట్టింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో పొందుపర్చాల్సిన చారిత్రక అంశాలపై ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ చక్రతీర్థ అనే రచయిత ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ కేబీ.హెడ్గేవార్ ఉపన్యాసాన్ని పదో తరగతి పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని ప్రతిపాదించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయంపై అనేక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘ఆల్ ఇండియా డెమొక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఏఐడీఎస్ఓ), ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ (ఏఐఎస్ఈసీ), సీఎఫ్ఐ వంటి సంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల ద్వారా ఆర్ఎస్ఎస్ సిద్దాంతాల్ని రుద్దాలని ప్రయత్నిస్తోందని ఆ సంస్థలు విమర్శిస్తున్నాయి.

Postal Servieces: యాప్ ద్వారా ఇంటింటికీ పోస్టల్ సేవలు

అయితే, కర్ణాటక విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ ఈ విమర్శల్ని తిప్పికొట్టారు. పాఠ్య పుస్తకాల్లో హెడ్గేవార్ గురించి ఉండదని, ప్రజలకు.. ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చే ఆయన ఉపన్యాసం మాత్రమే ఉంటుందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. కాగా, ఇప్పటికే కర్ణాటక పాఠ్య పుస్తకాల్లో టిప్పు సుల్తాన్ గురించి ఉన్న అనేక అంశాల్ని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.