Postal Servieces: యాప్ ద్వారా ఇంటింటికీ పోస్టల్ సేవలు

ఇంటింటికీ ఎప్పట్నుంచో పోస్టల్ సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సేవల్లో ఇప్పుడు కొత్త అధ్యాయానికి తెరతీసింది బెంగాల్. ఇకపై యాప్ ద్వారా ఇంటింటికీ పోస్టల్ సేవలు అందనున్నాయి.

Postal Servieces: యాప్ ద్వారా ఇంటింటికీ పోస్టల్ సేవలు

Postal Services

Postal Servieces: ఇంటింటికీ ఎప్పట్నుంచో పోస్టల్ సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సేవల్లో ఇప్పుడు కొత్త అధ్యాయానికి తెరతీసింది బెంగాల్. ఇకపై యాప్ ద్వారా ఇంటింటికీ పోస్టల్ సేవలు అందనున్నాయి. అంటే ఎవరైనా పోస్ట్ పంపాలన్నా, రిసీవ్ చేసుకోవాలన్నా పోస్టాఫీస్ దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా యాప్ ద్వారా నేరుగా బుక్ చేసుకోవచ్చు.

Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

యాప్ ద్వారా పోస్ట్‌మాన్ నేరుగా వినియోగదారుల ఇంటికే వచ్చి సేవలు అందిస్తారు. రిజిష్టర్ పోస్టులు, కొరియర్స్, ఉత్తరాలు వంటివి పంపేందుకు పోస్టాఫీస్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. యాప్‌లో రిక్వెస్ట్ పంపిస్తే చాలు. ఇంటి వద్దకే సేవలు అందుతాయి. ఒకసారి సర్వీస్ బుక్ చేసుకున్న తర్వాత, దానికి సంబంధించి పీడీఎఫ్ రూపంలో రిసీట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఆన్‌లైన్‌లోనే కాకుండా, ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుంది. బెంగాల్ పరిధిలో ఆఫ్‌లైన్‌ మోడ్‌లో కూడా పోస్టాఫీస్ సేవలు పొందేవీలుంది. అయితే, ముందుగా ఈ సేవలు కోల్‌కతాలోనే అందుబాటులోకి వస్తాయని, క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ జె.చారుకేశి అన్నారు.

Sugar Exports: చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం

ఈ కొత్త యాప్ ద్వారా ప్రజలకు మరింత మెరుగ్గా పోస్టాఫీస్ సేవలు అందుతాయని ఆమె చెప్పారు. వచ్చే నెలలో ‘నో యువర్ పోస్ట్‌మాన్’ పేరుతో కొత్త యాప్ కూడా లాంఛ్ చేయబోతుంది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. దీని ద్వారా కస్టమర్లు పార్సిల్స్ పంపడం, లేదా రిసీవ్ చేసుకోవచ్చు. వాటిని ట్రాక్ చేయవచ్చు.