Sugar Exports: చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం

ఇప్పటికే గోధుమ ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం త్వరలో చక్కెర ఎగుమతులను కూడా నిలిపివేయనుంది. వచ్చే నెల 1 నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

Sugar Exports: చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం

Sugar

Sugar Exports: ఇప్పటికే గోధుమ ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం త్వరలో చక్కెర ఎగుమతులను కూడా నిలిపివేయనుంది. వచ్చే నెల 1 నుంచి చక్కెర ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. వివిధ ఉత్పత్తుల ఎగుమతుల వల్ల దేశంలో ఆహార పదార్థాల లభ్యత తగ్గి ధరలు పెరిగిపోతున్నాయి. అందుకే దేశంలో ధరలను నియంత్రించే ఉద్దేశంతో ఒక్కో ఉత్పత్తిపై నిషేధం విధిస్తూ వస్తోంది కేంద్రం.

Congress: ఐదు నెలల్లో కాంగ్రెస్‌ను వీడిన ఐదుగురు నేతలు

చక్కెర ఎగుమతులపై నిషేధం విధించడం వల్ల దేశంలో చక్కెర ధరలు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అస్థిరత, యుద్ధ వాతావరణం వంటి అంశాల కారణంగా ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే దేశంలో నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని, ధరలను నియంత్రించే చర్యలు తీసుకుంటోంది కేంద్రం. దీనిలో భాగంగానే ఇటీవల గోధుమ ఎగుమతులపై నిషేధం విధించడంతోపాటు పెట్రో ధరలను కూడా తగ్గించింది. తాజాగా చక్కెర ఎగుమతులపై కూడా నిషేధం విధించింది. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది.

Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

దేశం నుంచి ప్రతి ఏటా చక్కెర ఎగుమతులు పెరిగిపోతున్నాయి. గత ఏడాది కూడా 70 లక్షల మెట్రిక్ టన్నుల చక్కెర విదేశాలకు ఎగుమతి అయింది. ఇలాగే ఎగుమతులు పెరిగితే, దేశంలో సామాన్యుడికి చక్కెర భారంగా మారుతుంది. అందుకే అందరికీ చక్కర ధరలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.