Congress: ఐదు నెలల్లో కాంగ్రెస్‌ను వీడిన ఐదుగురు నేతలు

ఒక పక్క దేశవ్యాప్తంగా బలపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే, మరోపక్క ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని జాతీయ స్థాయి కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.

Congress: ఐదు నెలల్లో కాంగ్రెస్‌ను వీడిన ఐదుగురు నేతలు

Congerss

Congress Top Leaders Exits: ఒక పక్క దేశవ్యాప్తంగా బలపడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే, మరోపక్క ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీలోని జాతీయ స్థాయి కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. దీంతో పార్టీకి నష్టం కలిగే అవకాశాలున్నాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవలే కొత్త కమిటీలను నియమించింది. పార్టీలో సంస్థాగతంగా మరెన్నో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఎలాగైనా బీజేపీని ఎదుర్కోవాలని శాయశక్తులా కృషి చేస్తోంది.

PM Modi: రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక.. స్వాగతం పలకనున్న..

అయితే, సొంత పార్టీ నేతలను కాపాడుకోవడంలో మాత్రం విఫలమవుతోంది. గడిచిన ఐదు నెలల కాలంలో పార్టీని ఐదుగురు కీలక నేతలు వదిలివెళ్లారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర న్యాయ శాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్ తాజాగా పార్టీని వీడారు. ఉత్తర ప్రదేశ్ నుంచి సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా లేఖ రాసిన 23 మంది కీలక నేతల్లో కపిల్ సిబల్ ఒకరు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మరో కీలక నేత సునీల్ జాకర్. ఈయన పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా చేశారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీతో సునీల్ జాకర్‌కు విబేధాలు ఉండటంతో, చన్నీపై, కాంగ్రెస్ పార్టీపై గతంలోనే అనేక విమర్శలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పంజాబ్‌లో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెలలోనే ఆయన కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరిపోయారు. గుజరాత్‌తో కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా ఉన్న హార్థిక్ పటేల్ కూడా ఈ నెలలోనే పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశారు.

Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

అయితే, తాజాగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ పార్టీని వీడారు. దీంతో గుజరాత్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలినట్లైంది. కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రిగా పనిచేసిన అశ్వని కుమార్ గత ఫిబ్రవరిలో పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పార్టీ మరింత పతనమవుతుందని ఆయన వ్యాఖ్యనించారు. కాంగ్రెస్‌కు దూరమైన మరో కీలక నేత ఆర్‌పీఎన్ సింగ్. కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. తాను పార్టీలో 32 ఏళ్లు ఉన్నానని, ఇప్పుడు ఆ పార్టీకి భవిష్యత్ లేదని ఆయన అన్నారు.