CCRH Recruitment 2025: CCRHలో ఉద్యోగాలు.. మొత్తం పోస్టులు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు..
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500.
CCRH Recruitment 2025: సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH) లో ఉద్యోగాలు పడ్డాయి. మొత్తం 89 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. నవంబర్ 26 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్లు(ccrhindia.ayush.gov.in, ccrhonline.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును బట్టి డిప్లొమా, B.Lisc, ఇంటర్, టెన్త్, BSc (నర్సింగ్), ఎంఫార్మసీ, MSc, MS, MD, DMLT, MLT ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. గ్రూప్ ఏ, బి, సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టులు..
* రీసెర్చ్ ఆఫీసర్ (హోమియోపతి, ఎండోక్రినాలజీ, ప్యాతాలజీ)
* అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మాకాలజీ)
* జూనియర్ లైబ్రేరియన్, ఫార్మాసిస్ట్, ఎక్స్ రే టెక్నీషియన్
* స్టాఫ్ నర్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్
* లోయర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, జూనియర్ స్టెనోగ్రాఫర్
విద్యార్హతలు..
* రీసెర్చ్ ఆఫీసర్స్ – సంబంధిత సబ్జెక్ట్ లో ఎండీ లేదా పీజీ
* జూనియర్ లైబ్రేరియన్ – లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ + ఏడాది అనుభవం
* ఫార్మసిస్ట్ – 12వ పాస్, హోమియోపతిలో డిప్లోమా/సర్టిఫికెట్
* ఎక్స్ రే టెక్నీషియన్ – ఎక్స్ రే టెక్నాలజీలో సర్టిఫికెట్ + ఏడాది అనుభవం
* స్టాఫ్ నర్స్ – బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం + పని చేసిన అనుభవం
* ఎల్ డీసీ- 12 పాస్ + టైపింగ్ స్కిల్స్
* డ్రైవర్ – 8వ తరగతి పాస్, LMV & HMV లైసెన్స్, రెండేళ్ల అనుభవం
ఫీజు..
జనరల్, ఓబీసీ, ఈడబ్లుఎస్ అభ్యర్థులకు – 500 రూపాయలు
ఎస్సీ, ఎస్టీ, పీడబ్లుడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు
ఆన్ లైన్ లో మాత్రమే ఫీజు చెల్లించాలి
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్ష
అవసరమైతే స్కిల్ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు ప్రక్రియ..
* ccrhindia.ayush.gov.in, ccrhonline.in వెబ్ సైట్స్ కి వెళ్లాలి
* మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్ట్రర్ చేసుకోవాలి
* పూర్తి వివరాలతో అప్లికేషన్ ఫార్మ్ నింపాలి
* అవసరమైన పత్రాలు, ఫోటో, సంతకం అప్ లోడ్ చేయాలి
* ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి
* ఫ్యూచర్ యూజ్ కోసం కన్ ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకోవాలి
