Ram Charan : తండ్రి కాబోతున్న రామ్‌చరణ్.. ట్వీట్ చేసిన చిరంజీవి!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. ప్రముఖ హాస్పిటల్స్ అపోలో వైస్ చైర్ పర్సన్ 'ఉపాసన కామినేని'ని రామ్ చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2012లో వీరి వివాహం ఘనంగా జరిగింది. మెగా వారసుడి కోసం ఫ్యాన్స్.. సోషల్ మీడియా వేదిక అనేక సార్లు ఉపాసనని కూడా ప్రశ్నించారు. తాజాగా నేడు మెగా అభిమానులకు.. మెగాస్టార్ చిరంజీవి శుభవార్త చెప్పాడు.

Ram Charan is going to be a father

Ram Charan : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు. ప్రముఖ హాస్పిటల్స్ అపోలో వైస్ చైర్ పర్సన్ ‘ఉపాసన కామినేని’ని రామ్ చరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2012లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే పిల్లలు విషయం గురించి వీరిద్దరూ ఇప్పటికి వరకు ఆలోచించలేదు. మెగా వారసుడి కోసం ఫ్యాన్స్.. సోషల్ మీడియా వేదిక అనేక సార్లు ఉపాసనని కూడా ప్రశ్నించారు.

Ram Charan : మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌లో.. బన్నీ, ఎన్టీఆర్ కంటే ముందు స్థానంలో రామ్‌చరణ్..

తాజాగా నేడు మెగా అభిమానులకు.. మెగాస్టార్ చిరంజీవి శుభవార్త చెప్పాడు. “ఆంజనేయ స్వామి అశీసులతో రామ్ చరణ్, ఉపాసనలు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు” అంటూ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మెగా అభిమానుల ఆనందానికి అయితే హద్దులు లేవు.

ఎప్పటినుంచో జూనియర్ చరణ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళ నిరీక్షణకు నేడు మోక్షం కలిగింది. కాగా ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియా వేదికగా సెలెబ్రెటీస్, ఫ్యాన్స్.. రామ్ చరణ్, ఉపాసన లతో పాటు తాత కాబోతున్న మెగాస్టార్ చిరంజీవికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.