Ram Charan : మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌లో.. బన్నీ, ఎన్టీఆర్ కంటే ముందు స్థానంలో రామ్‌చరణ్..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో విపిరితమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. సినిమాలో తన నటనకు ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు, హాలీవుడ్ లోని ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోతున్నారు. తాజాగా ప్రముఖ మూవీ రేటింగ్ ప్లాట్‌ఫార్మ్ అయిన 'IMDb'..

Ram Charan got 4th place in Most Popular Indian Stars 2022
Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో విపిరితమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఫ్రీడమ్ ఫైటర్ ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో రామ్ చరణ్ చూపిన నటన ప్రశంసనీయం. డిఫరెంట్ లేయర్స్ ఉన్న ఆ పాత్రని చరణ్ చాలా ఈస్ తో చేసి, విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంటున్నాడు. ఇక సినిమాలో తన నటనకు ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాదు, హాలీవుడ్ లోని ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోతున్నారు.
Ram Charan : చరణ్ బాలీవుడ్ ఎంట్రీ బాధ్యత.. సల్లూ భాయ్ తీసుకున్నాడా??
తాజాగా ప్రముఖ మూవీ రేటింగ్ ప్లాట్‌ఫార్మ్ అయిన ‘IMDb’.. మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ 2022 లిస్ట్ ని ప్రకటించింది. ఈ లిస్ట్ లో టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన తోటి స్టార్స్ అయిన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ని వెన్నకి నెట్టి ముందు స్థానంలో నిలిచాడు. ఈ లిస్ట్ లో చరణ్ నాలుగో ప్లేస్‌లో ఉండగా, తారక్ అండ్ బన్నీ 8, 9 స్థానాల్లో నిలిచారు. ఇదే లిస్ట్ లో సమంత చరణ్ తరువాత 5వ ప్లేస్‌లో ఉండడం విశేషం.
ఇక ఈ IMDb రేటింగ్ లో మొదటి స్థానం తమిళ హీరో ‘ధనుష్’, చివరి స్థానంలో కన్నడ స్టార్ హీరో ‘యష్’ ఉన్నారు. కాగా రామ్ చరణ్ ప్రెజెంట్ యూత్ ఐకాన్ గా మారిపోయాడు. తన డ్రెస్సింగ్ స్టైల్ కి, తన బాడీ మెయిన్టైన్స్ కి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. చరణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఫాలోయర్స్ కూడా రోజురోజకి పెరిగిపోతూ వెళుతున్నారు. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ లో 10 మిలియన్ మైల్ రాయిని అందుకున్నాడు.
IMDb’s Top 10 Most Popular Indian Stars of the Year#Dhanush at the top ?#AliaBhatt #AishwaryaRaiBachchan#RamCharan#Samantha#HrithikRoshan#KiaraAdvani#JrNTR #AlluArjun#Yash pic.twitter.com/fNr3BWCHC0
— BINGED (@Binged_) December 7, 2022