Ram Charan : చరణ్ బాలీవుడ్ ఎంట్రీ బాధ్యత.. సల్లూ భాయ్ తీసుకున్నాడా??

RRR సూపర్ సక్సెస్ తో రామ్ చరణ్ దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ లోనూ షాకింగ్ కలెక్షన్స్ తెచ్చింది ఈ సినిమా. ఇటీవల వరుసగా బాలీవుడ్ లో ఈవెంట్స్ కి హాజరవుతున్నాడు, పలు అవార్డులు అందుకుంటున్నాడు చరణ్. ఈ నేపథ్యంలో చెర్రీ............

Ram Charan : చరణ్ బాలీవుడ్ ఎంట్రీ బాధ్యత.. సల్లూ భాయ్ తీసుకున్నాడా??

Ram Charan re entry in Bollywood with help of Salman Khan

Ram Charan :  RRR సూపర్ సక్సెస్ తో రామ్ చరణ్ దేశవ్యాప్తంగా ఓ రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్నాడు. బాలీవుడ్ లోనూ షాకింగ్ కలెక్షన్స్ తెచ్చింది ఈ సినిమా. ఇటీవల వరుసగా బాలీవుడ్ లో ఈవెంట్స్ కి హాజరవుతున్నాడు, పలు అవార్డులు అందుకుంటున్నాడు చరణ్. ఈ నేపథ్యంలో చెర్రీ బాలీవుడ్ లో ఈ సారి బిగ్ ఎంట్రీ ఇస్తాడని బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో సల్మాన్ ఖాన్ చెర్రీకి హెల్ప్ చేస్తున్నాడట.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సల్మాన్ కు చిరంజీవి అంటే చెప్పలేని గౌరవం. సల్లూ భాయ్ అంటే చిరూకి కూడా అంతకు మించిన వాత్సల్యం. ఇక చరణ్, సల్మాన్ ఖాన్ రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వస్తే చరణ్ ఇంట్లోనే మకాం. చెర్రీ ముంబై వెళితే సల్లూభాయే ఆతిథ్యం ఇస్తాడు. ఈ క్రమంలో ఈ ఇద్దరి రిలేషన్ ఇప్పుడు బాలీవుడ్ లో ఓ బిగ్ మూవీకి నాంది పలకబోతోందని టాక్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ బాలీవుడ్ లో సైతం దుమ్మురేపడంతో రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందు ‘జంజీర్’ మూవీతో చెర్రీ బాలీవుడ్ లో హీరోగా ఎంటర్ అయ్యాడు. కానీ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ చెర్రీ మళ్ళీ బాలీవుడ్ ఆలోచన చేయలేదు. అయితే ఈ సారి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ సక్సెస్ బేస్ గా చెర్రీ బాలీవుడ్ కు వెళ్ళేందుకు భారీ స్కెచే వేసినట్టు టాక్. దీని వెనుక సల్మాన్ ఖాన్ హస్తముందని సమాచారం.

Pathaan : ఒక్క సినిమా.. 8 దేశాల్లో షూటింగ్.. ‘పఠాన్’తో షారుఖ్ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ..

ప్రజెంట్ సల్మాన్ ఖాన్ చరణ్ కోసం స్ర్కిప్ట్స్ చదవడంలో బిజీగా ఉన్నాడట. చరణ్ కు ఎలాంటి స్టోరీ బాగుంటుందో సెర్చ్ చేసి బాగున్నది చెర్రీకి ఫార్వార్డ్ చేస్తున్నాడట. రామ్ చరణ్ మార్కెట్ ను బాలీవుడ్ లో సస్టెయిన్ చేయడంలో సల్లూభాయ్ పాత్ర కీలకం కాబోతోందని టాక్స్ వినిస్తున్నాయి. మరి చరణ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాడా, ఇస్తే ఎలాంటి సినిమాతో ఇస్తాడో, సల్మాన్ ఖాన్ చరణ్ ని ఏ రేంజ్ లో అక్కడ రీలాంచ్ చేస్తాడో చూడాలి.