Ram Charan Watch: బాప్‌రే.. చెర్రీ వాచ్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
మెగా వారసుడు రామ్ చరణ్ కాస్త విలాసవంతంగా బ్రతుకుతాడని పేరున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ధరించిన వాచ్ మోడల్, దాని ధర ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ ఎక్కడకి వెళ్లినా ఇదే వాచ్ ధరించి కనిపిస్తున్నారు.
- Naresh Mannam
- Published On : April 10, 2021 / 04:34 PM IST
Ram Charan Watch If You Know The Price Of A Cherry Watch You Should Be Shocked
Ram Charan Watch: సాధారణంగానే సెలబ్రిటీలు ధరించే దుస్తుల దగ్గర్నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్ని కాస్ట్‌లీగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. వాళ్ళు ధరించే చెప్పులు, బూట్ల నుండి తలకు ధరించే బ్యాండ్స్ వరకు లక్షలు వెచ్చించే వాళ్ళు కూడా ఉన్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలైతే ఇది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. కోట్లకు కోట్లు పెట్టి హ్యాండ్ బ్యాగ్స్, లిప్ స్టిక్స్ కోనేస్తుంటారు. కాగా.. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా కొందరు వాళ్ళు వాడే వస్తువుల కోసం లక్షలు, కోట్లు ఖర్చు పెడుతున్నారు. వీటి ధర తెలుసుకొనేందుకు ప్రేక్షకులు కూడా బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
కాగా, మెగా వారసుడు రామ్ చరణ్ కాస్త విలాసవంతంగా బ్రతుకుతాడని పేరున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ధరించిన వాచ్ మోడల్, దాని ధర ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ ఎక్కడకి వెళ్లినా ఇదే వాచ్ ధరించి కనిపిస్తున్నారు. ఈక్రమంలోనే చరణ్ ధరించిన వాచ్ పేరు, దాని ఖరీదు తెలుసుకొని షాక్ అవుతున్నారు. ఎందుకంటే మెగా పవర్ స్టార్ ధరించిన వాచ్ లక్ష 50 వేల డాలర్లట. అంటే మన ఇండియన్ కరెన్సీలో దీని ధర ఏకంగా కోటి 50 లక్షల రూపాయల పైనే అనమాట.
Richard Mille కంపెనీని చెందిన ఈ వాచ్ గురించి నెటిజన్స్ సెర్చ్ చేసి, అది ధరించిన చెర్రీ ఫోటోలను కలిపి సోషల్ మీడియాలో రకరకాల కామెట్స్ పెడుతున్నారు. ఒక్క వాచ్ కోసం పెట్టే డబ్బుతో కొన్ని పేద కుటుంబాలు జీవితాంతం సుఖంగా బ్రతికేయొచ్చని కొందరు అంటుంటే.. ఆ వాచ్ కి పెట్టిన డబ్బు పేద కుటుంబాలకిస్తే ఎంతోమంది బాగుపడతారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మెగా అభిమానులు మాత్రం స్టార్స్ అన్నప్పుడు ఆ మాత్రం ఖరీదు పెట్టి కొనుక్కోవడం తప్పేమీ కాదులే అంటూ వెనకేసుకొస్తున్నారు.
Read: Jr NTR: మూడు ఇండస్ట్రీలనుండి ముగ్గురు అగ్ర దర్శకులతో తారక్!
