Jr NTR: మూడు ఇండస్ట్రీలనుండి ముగ్గురు అగ్ర దర్శకులతో తారక్!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ తెలుగులో అగ్ర దర్శకులలో ఒకరైతే తమిళ, కన్నడ సీమల నుండి కూడా మరో ఇద్దరు అగ్ర దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు మొదలు కానున్నాయట.

Jr NTR: మూడు ఇండస్ట్రీలనుండి ముగ్గురు అగ్ర దర్శకులతో తారక్!

Jr Ntr Tarak With Three Top Directors From Three Industries

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమరం భీంగా నటిస్తున్నాడు తారక్. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా వీరికి జోడిగా బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్స్ ను తీసుకొచ్చారు. అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకగా ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తిచేసుకుంది. కాగా.. ఆర్ఆర్ఆర్ సినిమాతో కరోనా గ్యాప్ ను కూడా భర్తీ చేసేందుకు ఎన్టీఆర్ పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు. కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి నిర్మిస్తున్న ఈ పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌తో పాటు ‘చౌడప్ప నాయుడు’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. త్రివిక్రమ్ తెలుగులో అగ్ర దర్శకులలో ఒకరైతే తమిళ, కన్నడ సీమల నుండి కూడా మరో ఇద్దరు అగ్ర దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు మొదలు కానున్నాయట. కేజీఎఫ్ తో పాన్ ఇండియా లెవల్ లో పేరు మార్మ్రోగిపోయిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కేజీఎఫ్-2 సినిమా పనులలో ఉన్న ప్రశాంత్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు.

ఇటు రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ తో పాటు మరో తమిళ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా లైన్ లో పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది. తమిళంలో ‘ఖైదీ’, ‘మాస్టర్’ వంటి సినిమాలతో సత్తా చాటిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కానీ తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో కానీ ఎన్టీఆర్ మరో సినిమా చేయనున్నాడని వినిపిస్తుంది. అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్ అనే చర్చ చాలాకాలంగా జరుగుతున్నదే కాగా లోకేష్ కనగరాజ్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు సాగుతున్నాయి. మొత్తంగా టాలెంటెడ్ అండ్ టాప్ దర్శకులతోనే ఎన్టీఆర్ లైన్ అప్ సెట్ చేసినట్లుగా అర్ధమవుతుంది.

read: Vakeel Saab: వెర్రి అభిమానం.. థియేటర్లో రక్తంతో పవన్ పేరు!