IPL 2026: సెంచరీతో చెలగేరిన సంజూ.. ముంబైపై చెన్న ఘన విజయం
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్ కే భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
IPL 2026: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ దుమ్మురేపింది. ముంబైపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్ కే భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగాడు. 54 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. 208 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా 103 రన్స్ భారీ తేడాతో సీఎస్ కే విజయదుంధుబి మోగించింది.
